ఏమని విన్నవించేము యిఁక నీకును
(॥పల్లవి॥)
ఏమని విన్నవించేము యిఁక నీకును
కామిని భాగ్యము మరి కలది నీచిత్తము
(॥ఏమ॥)
చెలికి నీవు బత్తిసేసినచేఁతలు
తలకొని యేపొద్దూఁ దలపోఁతలు
చెలరేఁగి మరుఁడువ్రాసినవ్రాఁతలు
కొలఁదిమీరిననీకొనగోరిగీఁతలు
(॥ఏమ॥)
ఆకెతోడ నీవు సారె నాడినయట్టిమాఁటలు
కైకొని నమ్మెనవె బంగారుమూఁటలు
జోకలుగ మోవితేనెసోనవూటలు
నీకు నేఁడు గలిగె నన్నిటాఁ బూఁటవూఁటలు
(॥ఏమ॥)
చిత్తగిం చిద్దరూఁ గలసినపొందులు
హత్తినలోలోని మోహపువిందులు
యిత్తల శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
కొత్తలుగాఁ గూడినసిగ్గుల కివె సందులు
(||pallavi||)
emani vinnaviṁchemu yim̐ka nīgunu
kāmini bhāgyamu mari kaladi nīsittamu
(||ema||)
sĕligi nīvu battisesinasem̐talu
talagŏni yebŏddūm̐ dalabom̐talu
sĕlarem̐gi marum̐ḍuvrāsinavrām̐talu
kŏlam̐dimīrinanīgŏnagorigīm̐talu
(||ema||)
āgĕdoḍa nīvu sārĕ nāḍinayaṭṭimām̐ṭalu
kaigŏni nammĕnavĕ baṁgārumūm̐ṭalu
jogaluga movidenĕsonavūḍalu
nīgu nem̐ḍu galigĕ nanniḍām̐ būm̐ṭavūm̐ṭalu
(||ema||)
sittagiṁ siddarūm̐ galasinabŏṁdulu
hattinaloloni mohabuviṁdulu
yittala śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
kŏttalugām̐ gūḍinasiggula kivĕ saṁdulu