ఏమని విన్నవించేము యెందాఁకాను
(॥పల్లవి॥)
ఏమని విన్నవించేము యెందాఁకాను
నీ మనసే యెఱుఁగును నేఁడెంత సేసేవు
(॥॥)
వలపెల్లా నొక్కటే వారివారిలోపల
కొలఁదిమీరినయట్టిగుణాలు వేరు
చెలిమీ నటువంటిదే చెప్పి చూపఁబోఇతేను
వెలలేని నేర్పులు వేవేలు గాని
(॥॥)
మన సందరివంటిదే మరిగివుండేయపుడు
ననుపులసరసాలే నానాగతులు
తనువు లొద్దికైనవేళ తరితీపు లెంచితేను
చెనకులో సన్నలే చిత్రములుగాని
(॥॥)
పొందులు నెప్పటివే భోగించేయప్పుడు
మందలించి కరఁగించేమర్మాలు వింత
చెందితివి నన్ను నిట్టె శ్రీ వేంకటేశ్వర
విందుల మోవియీవులే వేడుకలు గాని
(||pallavi||)
emani vinnaviṁchemu yĕṁdām̐kānu
nī manase yĕṟum̐gunu nem̐ḍĕṁta sesevu
(||||)
valabĕllā nŏkkaḍe vārivārilobala
kŏlam̐dimīrinayaṭṭiguṇālu veru
sĕlimī naḍuvaṁṭide sĕppi sūbam̐boidenu
vĕlaleni nerbulu vevelu gāni
(||||)
mana saṁdarivaṁṭide marigivuṁḍeyabuḍu
nanubulasarasāle nānāgadulu
tanuvu lŏddigainaveḽa taridību lĕṁchidenu
sĕnagulo sannale sitramulugāni
(||||)
pŏṁdulu nĕppaḍive bhogiṁcheyappuḍu
maṁdaliṁchi karam̐giṁchemarmālu viṁta
sĕṁdidivi nannu niṭṭĕ śhrī veṁkaḍeśhvara
viṁdula moviyīvule veḍugalu gāni