Emani vinnavimchemu yemdaamkaa needo

ఏమని విన్నవించేము యెందాఁకా నీతో
Language

(॥పల్లవి॥)
ఏమని విన్నవించేము యెందాఁకా నీతో
దోమటి దొడుకవయ్యా తొలుసారె చెలిని

(॥ఏమ॥)
చెప్పరానిమోహము చిత్తములో నున్నది
కుప్పళించే మదమెల్లా గుబ్బలపైనున్నది
కప్పిన కాఁకలెల్లాను కాయముపై నున్నవి
చొప్పుతోనె రావయ్యా చూతువు యీచెలిని

(॥ఏమ॥)
ఘనమైన అడియాస కన్నులనే వున్నది
మనుకొన్న సంతోసము మోముననే వున్నది
పెనగొన్న మాటలెల్లా పెదవిపై నున్నవి
కనుగొందువు రావయ్యా కమ్మటి యీచెలిని

(॥ఏమ॥)
కడలేనితమకము కాఁగిటిలో నున్నది
చిడుముడి సిగ్గులెల్లా సెలవుల నున్నవి
బడినే శ్రీవేంకటేశ భామ నిట్టె కూడితివి
యెడయకువయ్యా ఇట్టె యీ చెలిని

(||pallavi||)
emani vinnaviṁchemu yĕṁdām̐kā nīdo
domaḍi dŏḍugavayyā tŏlusārĕ sĕlini

(||ema||)
sĕpparānimohamu sittamulo nunnadi
kuppaḽiṁche madamĕllā gubbalabainunnadi
kappina kām̐kalĕllānu kāyamubai nunnavi
sŏppudonĕ rāvayyā sūduvu yīsĕlini

(||ema||)
ghanamaina aḍiyāsa kannulane vunnadi
manugŏnna saṁtosamu momunane vunnadi
pĕnagŏnna māḍalĕllā pĕdavibai nunnavi
kanugŏṁduvu rāvayyā kammaḍi yīsĕlini

(||ema||)
kaḍalenidamagamu kām̐giḍilo nunnadi
siḍumuḍi siggulĕllā sĕlavula nunnavi
baḍine śhrīveṁkaḍeśha bhāma niṭṭĕ kūḍidivi
yĕḍayaguvayyā iṭṭĕ yī sĕlini