Emani vinnavimchemu yeebe suddulu

ఏమని విన్నవించేము యీపె సుద్దులు
Language

(॥పల్లవి॥)
ఏమని విన్నవించేము యీపె సుద్దులు
కోమలి కోరికె లివి కోటానఁగోట్లు

(॥ఏమ॥)
పడఁతుల నీగుణాలు పలుమారు నడుగును
వుడవోని సంతోసాల నుమ్మగిలును
తడయక కొంతవడి తలఁచు నీరూపము
వడియుఁ జెమటతోడ వలలఁ బొరలును

(॥ఏమ॥)
నిలుచుండి తొంగి తొంగి నీరాక కెదురుచూచు
పొలసి యడియాసల బొద్దు గడపు
పలుకు నీవుండినట్టే భావించి పానుపు మీఁద
అలరి తననీడ నీవని కాఁగిలించును

(॥ఏమ॥)
ఆకు మడిచి నీకిచ్చేనని నోర నందిచ్చు
పైకొని వోలలాడును భావరతుల
చేకొని ఇంతలో వచ్చి శ్రీవేంకటేశ కూడితి -
వీకె యలమేలుమంగ ఇప్ప డురమెక్కెను

(||pallavi||)
emani vinnaviṁchemu yībĕ suddulu
komali korigĕ livi koḍānam̐goṭlu

(||ema||)
paḍam̐tula nīguṇālu palumāru naḍugunu
vuḍavoni saṁtosāla nummagilunu
taḍayaga kŏṁtavaḍi talam̐su nīrūbamu
vaḍiyum̐ jĕmaḍadoḍa valalam̐ bŏralunu

(||ema||)
nilusuṁḍi tŏṁgi tŏṁgi nīrāga kĕdurusūsu
pŏlasi yaḍiyāsala bŏddu gaḍabu
palugu nīvuṁḍinaṭṭe bhāviṁchi pānubu mīm̐da
alari tananīḍa nīvani kām̐giliṁchunu

(||ema||)
āgu maḍisi nīgichchenani nora naṁdichchu
paigŏni volalāḍunu bhāvaradula
segŏni iṁtalo vachchi śhrīveṁkaḍeśha kūḍidi -
vīgĕ yalamelumaṁga ippa ḍuramĕkkĕnu