ఏమని విన్నవించేము ఇన్నియు నీ చిత్తమే
(॥పల్లవి॥)
ఏమని విన్నవించేము ఇన్నియు నీ చిత్తమే
నీ మతకమంతయును నెరవేరెఁగా
(॥ఏమని॥)
గోవిందుఁడవైతివి గోపాలుఁడవైతివి
వావులెంచ కిందరిని వలపింతురా
పూవుల వేసినవారు పప్పొడి చల్లినవారు
వోవరిలోపల నీకు వొక్కసరేకా
(॥ఏమని॥)
రాచవాఁడవై తేనేమి రచ్చగొల్లవైతే నేమి
చూచి పాలు వెన్నలు ముచ్చులు కొందురా
కాచుక వుండినవారు గక్కన వచ్చినవారు
చేచేత సేస వెట్టితే చెలఁగి సరే కా
(॥ఏమని॥)
మంచిదేవుఁడవు గా మానిసి రూపైనాఁ గా
కొంచక సతుల నెత్తుకొని వత్తురా
పొంచి శ్రీ వేంకటేశ్వర పొరుగువా రిరుగువాఁ
రెంచ నీకు మంచముపైనిందరు సరేకా
(||pallavi||)
emani vinnaviṁchemu inniyu nī sittame
nī madagamaṁtayunu nĕraverĕm̐gā
(||emani||)
goviṁdum̐ḍavaidivi gobālum̐ḍavaidivi
vāvulĕṁcha kiṁdarini valabiṁturā
pūvula vesinavāru pappŏḍi sallinavāru
vovarilobala nīgu vŏkkasaregā
(||emani||)
rāsavām̐ḍavai tenemi rachchagŏllavaide nemi
sūsi pālu vĕnnalu muchchulu kŏṁdurā
kāsuga vuṁḍinavāru gakkana vachchinavāru
seseda sesa vĕṭṭide sĕlam̐gi sare kā
(||emani||)
maṁchidevum̐ḍavu gā mānisi rūbainām̐ gā
kŏṁchaga sadula nĕttugŏni vatturā
pŏṁchi śhrī veṁkaḍeśhvara pŏruguvā riruguvām̐
rĕṁcha nīgu maṁchamubainiṁdaru saregā