Emani vinnavimchemu imtibhaava midivo

ఏమని విన్నవించేము ఇంతిభావ మిదివొ
Language

(॥పల్లవి॥)
ఏమని విన్నవించేము ఇంతిభావ మిదివొ
నీ మనసుకొలఁ దిఁక నెలఁతకుఁ బ్రియుఁడా

(॥ఏమ॥)
గందాన బొట్టువెట్టఁగఁ గాంతకు నిట్టూర్పు రేఁగె
పొందగుగాలికి నది పుట్టినిల్లంటా
విందుగాఁ దామెరిచ్చితే విరహ సూర్యఁడు మించె
అందులోఁ జుట్టరికము లమరునంటాను

(॥ఏమ॥)
కలికి మేఘవన్నె గప్పితేఁ జెమటవాన
గలిగె నదియే తమకాలమంటాను
బలిమిఁ జిగురుపాన్పు పరచితేఁ బులకలు
వెలిఁ బూచె వసంతపువేళ వచ్చెననుచు

(॥ఏమ॥)
కాంత చంద్రశాల కేఁగ కన్నుఁగలువలు విచ్చె
పొంతనే వొండికటికిఁ బొందౌనంటా
ఇంతలో శ్రీవేంకటేశ యిటు నీవు గూడఁగాను
సంతసాలు దైవారి చవులాయ నివియె

(||pallavi||)
emani vinnaviṁchemu iṁtibhāva midivŏ
nī manasugŏlam̐ dim̐ka nĕlam̐tagum̐ briyum̐ḍā

(||ema||)
gaṁdāna bŏṭṭuvĕṭṭam̐gam̐ gāṁtagu niṭṭūrbu rem̐gĕ
pŏṁdagugāligi nadi puṭṭinillaṁṭā
viṁdugām̐ dāmĕrichchide viraha sūryam̐ḍu miṁchĕ
aṁdulom̐ juṭṭarigamu lamarunaṁṭānu

(||ema||)
kaligi meghavannĕ gappidem̐ jĕmaḍavāna
galigĕ nadiye tamagālamaṁṭānu
balimim̐ jigurubānpu parasidem̐ bulagalu
vĕlim̐ būsĕ vasaṁtabuveḽa vachchĕnanusu

(||ema||)
kāṁta saṁdraśhāla kem̐ga kannum̐galuvalu vichchĕ
pŏṁtane vŏṁḍigaḍigim̐ bŏṁdaunaṁṭā
iṁtalo śhrīveṁkaḍeśha yiḍu nīvu gūḍam̐gānu
saṁtasālu daivāri savulāya niviyĕ