Emani vinnavimchemu imti samdamulu neegu

ఏమని విన్నవించేము ఇంతి చందములు నీకు
Language

(॥పల్లవి॥)
ఏమని విన్నవించేము ఇంతి చందములు నీకు
ఆముకొన్న కరుణతో నాదరింతు గాక

(॥ఏమ॥)
వొప్పగు నిన్నుఁ దలఁచి వువిద పాన్పు మీద
నుప్పతిల్లుఁ జెమటల నోలలాడీని
ముప్పిరిగొన్నవయసు ముంచి యాసలు రేఁచఁగా
చెప్పరాని వలపుల జిమ్మిరేఁగీని

(॥ఏమ॥)
వొట్టిన నీగుణములు వొకటొకటే యెంచుక
అట్టె నిట్టూరూపుల నుయ్యాల లూఁగీని
గట్టిగా నీవిచ్చినవుంగరము చూచి చూచి
గుట్టుతో దమకముల గుబ్బతిలీని

(॥ఏమ॥)
గక్కనఁ జెలులు నీకతలు చెప్పఁగా విని
వెక్కసపుఁ బులకల విఱ్ఱవీఁగీని
యిక్కడ వచ్చి శ్రీవేంకటేశ యింతిఁ గూడితివి
పిక్కటిల్లు సంతోసాలఁ బెనగొనీని

(||pallavi||)
emani vinnaviṁchemu iṁti saṁdamulu nīgu
āmugŏnna karuṇado nādariṁtu gāga

(||ema||)
vŏppagu ninnum̐ dalam̐si vuvida pānpu mīda
nuppadillum̐ jĕmaḍala nolalāḍīni
muppirigŏnnavayasu muṁchi yāsalu rem̐sam̐gā
sĕpparāni valabula jimmirem̐gīni

(||ema||)
vŏṭṭina nīguṇamulu vŏgaḍŏgaḍe yĕṁchuga
aṭṭĕ niṭṭūrūbula nuyyāla lūm̐gīni
gaṭṭigā nīvichchinavuṁgaramu sūsi sūsi
guṭṭudo damagamula gubbadilīni

(||ema||)
gakkanam̐ jĕlulu nīgadalu sĕppam̐gā vini
vĕkkasabum̐ bulagala viṭravīm̐gīni
yikkaḍa vachchi śhrīveṁkaḍeśha yiṁtim̐ gūḍidivi
pikkaḍillu saṁtosālam̐ bĕnagŏnīni