ఏమని విన్నవించేము ఇంతి నీపైఁ గల ప్రేమ
(॥పల్లవి॥)
ఏమని విన్నవించేము ఇంతి నీపైఁ గల ప్రేమ
కోమలపుఁ గలికి చెక్కునఁ జేయిచేర్చెను
(॥॥)
యేకతాన నుండి సతి ఇట్టె నిన్నుఁ దలఁపైతే
చేకొని నిట్టూర్పు నించి చెలులఁ జూచె
పైకొని వారందరు కోపాన నిన్ను దూరితేను
దాకొని యేమీ ననక తలవంచుకొనెను
(॥॥)
మంచముపైనుండి కాంత మనసు నీపైఁ బారితే
పొంచి మాటాడేచిలుకఁ బొక్కుచుఁ దిట్టె
ముంచి యందుకు నది నీముఁజేత వాలితేను
దించని చలమున నీదిక్కు చూచెను
(॥॥)
వురమె క్కెలమేల్మంగ వోగి చన్నులు నాఁటితే
వొరటుజక్కవలపై నొలవేసెను
మొరసి శ్రీ వేంకటేశ ముక్కులన వెంటించితే
తెరసేసి నినుఁగూడి తెప్పలనుఁ దేలెను
(||pallavi||)
emani vinnaviṁchemu iṁti nībaim̐ gala prema
komalabum̐ galigi sĕkkunam̐ jeyisersĕnu
(||||)
yegadāna nuṁḍi sadi iṭṭĕ ninnum̐ dalam̐paide
segŏni niṭṭūrbu niṁchi sĕlulam̐ jūsĕ
paigŏni vāraṁdaru kobāna ninnu dūridenu
dāgŏni yemī nanaga talavaṁchugŏnĕnu
(||||)
maṁchamubainuṁḍi kāṁta manasu nībaim̐ bāride
pŏṁchi māḍāḍesilugam̐ bŏkkusum̐ diṭṭĕ
muṁchi yaṁdugu nadi nīmum̐jeda vālidenu
diṁchani salamuna nīdikku sūsĕnu
(||||)
vuramĕ kkĕlamelmaṁga vogi sannulu nām̐ṭide
vŏraḍujakkavalabai nŏlavesĕnu
mŏrasi śhrī veṁkaḍeśha mukkulana vĕṁṭiṁchide
tĕrasesi ninum̐gūḍi tĕppalanum̐ delĕnu