ఏమని విన్న వించేము యీ వనిత సింగారము
(॥పల్లవి॥)
ఏమని విన్న వించేము యీ వనిత సింగారము
ఆముకొన్న వినోదము లవధరించవయ్యా
(॥ఏమ॥)
నగవులు సెలువుల నాటుకొన్న లాగులు
చిగురుఁబెదవిమీఁదఁ జిమ్ము ప్రియములు
పగటుఁ జన్నులమీఁదఁ బాదుకొన్నమించులు
జగిమించి నీచెలికిఁ జిత్తగించవయ్యా
(॥ఏమ॥)
నిలువెల్లా సిగ్గులే నిండుకొన్నవిధములు
పలుకులఁ దేనెగారేభావములు
కలువకన్నులఁ గారుకమ్మేసొబగులు
చెలరేఁగీ నతివకుఁ జిత్తగించవయ్యా
(॥ఏమ॥)
మనసులో సారెసారె మలసేటితమకము
వినయములోఁ దొలఁకేవేడుకలు
వనితకు నీకాఁగిట వీడికాయ వలపులు
చెనకి శ్రీవేంకటేశ చిత్తగించవయ్యా
(||pallavi||)
emani vinna viṁchemu yī vanida siṁgāramu
āmugŏnna vinodamu lavadhariṁchavayyā
(||ema||)
nagavulu sĕluvula nāḍugŏnna lāgulu
sigurum̐bĕdavimīm̐dam̐ jimmu priyamulu
pagaḍum̐ jannulamīm̐dam̐ bādugŏnnamiṁchulu
jagimiṁchi nīsĕligim̐ jittagiṁchavayyā
(||ema||)
niluvĕllā siggule niṁḍugŏnnavidhamulu
palugulam̐ denĕgārebhāvamulu
kaluvagannulam̐ gārugammesŏbagulu
sĕlarem̐gī nadivagum̐ jittagiṁchavayyā
(||ema||)
manasulo sārĕsārĕ malaseḍidamagamu
vinayamulom̐ dŏlam̐keveḍugalu
vanidagu nīgām̐giḍa vīḍigāya valabulu
sĕnagi śhrīveṁkaḍeśha sittagiṁchavayyā