Emani vineno yidu nee saridalu

ఏమని వినెనో యిటు నీ సరితలు
Language

(॥పల్లవి॥)
ఏమని వినెనో యిటు నీ సరితలు
తామర విసురుచుఁ దాఁకించీని

(॥॥)
యీలాగున నీ వింటికి రాఁగా
వాలుకచూపులు వంచీఁ జెలి
ఆలరివై మాటాడకమును పే
కోలుముందుగాఁగొసరీని

(॥॥)
ననుపున వీవిటు నవ్వులు నవ్వఁగ
కినియుచుఁ గడుజంకించీని
చనవునఁ బైఁ జేయి చాఁచకమునుపే
పెనఁగుచు నానలు వెట్టీని

(॥॥)
గక్కున నీవిటు కాఁగిలించఁ గా
అక్కజపురతుల నలసీని
యిక్కువ శ్రీ వేంకటేశ మునుపనే
చెక్కులు నొక్కుచుఁ జెనకీని

(||pallavi||)
emani vinĕno yiḍu nī saridalu
tāmara visurusum̐ dām̐kiṁchīni

(||||)
yīlāguna nī viṁṭigi rām̐gā
vālugasūbulu vaṁchīm̐ jĕli
ālarivai māḍāḍagamunu pe
kolumuṁdugām̐gŏsarīni

(||||)
nanubuna vīviḍu navvulu navvam̐ga
kiniyusum̐ gaḍujaṁkiṁchīni
sanavunam̐ baim̐ jeyi sām̐sagamunube
pĕnam̐gusu nānalu vĕṭṭīni

(||||)
gakkuna nīviḍu kām̐giliṁcham̐ gā
akkajaburadula nalasīni
yikkuva śhrī veṁkaḍeśha munubane
sĕkkulu nŏkkusum̐ jĕnagīni