ఏమని వలపు చెప్పే నెవ్వరూ నే మెఱిఁగేరు
(॥పల్లవి॥)
ఏమని వలపు చెప్పే నెవ్వరూ నే మెఱిఁగేరు
నేమపు నీగుణాలకు నీవే సాక్షి
(॥ఏమ॥)
వొనర నీపైబత్తి వొరులకుఁ జెప్పరాదు
మనసులోపలనున్నమరుఁడే సాక్షి
నినుఁబాసి విరహాన నే నిందాఁకా నున్నందుకు
నినుపులయిననానిట్టూర్పులే సాక్షి
(॥ఏమ॥)
నెక్కొన్న నాకోరికలు నీతో వాకుచ్చరాదు
దిక్కులను మొక్కుకొన్న దేవరే సాక్షి
చొక్కపునాచూపులసూటి నీపైనున్నందుకు
పక్కన నే నుండేటిభావమే సాక్షి
(॥ఏమ॥)
బాసతోడ నీకాఁగిటఁ బాయలేకవున్నందుకు
రాసికెక్కనట్టినారతియే సాక్షి
సేసవెట్టి యేలితివి శ్రీవేంకటేశ్వర నన్ను
ఆసుద్దులకెల్లా మనఆయములే సాక్షి
(||pallavi||)
emani valabu sĕppe nĕvvarū ne mĕṟim̐geru
nemabu nīguṇālagu nīve sākṣhi
(||ema||)
vŏnara nībaibatti vŏrulagum̐ jĕpparādu
manasulobalanunnamarum̐ḍe sākṣhi
ninum̐bāsi virahāna ne niṁdām̐kā nunnaṁdugu
ninubulayinanāniṭṭūrbule sākṣhi
(||ema||)
nĕkkŏnna nāgorigalu nīdo vāguchcharādu
dikkulanu mŏkkugŏnna devare sākṣhi
sŏkkabunāsūbulasūḍi nībainunnaṁdugu
pakkana ne nuṁḍeḍibhāvame sākṣhi
(||ema||)
bāsadoḍa nīgām̐giḍam̐ bāyalegavunnaṁdugu
rāsigĕkkanaṭṭināradiye sākṣhi
sesavĕṭṭi yelidivi śhrīveṁkaḍeśhvara nannu
āsuddulagĕllā manaāyamule sākṣhi