Emani talamtumamma nimkaa needevuni

ఏమని తలఁతుమమ్మ నింకా నీదేవుని
Language

(॥పల్లవి॥)
ఏమని తలఁతుమమ్మ నింకా నీదేవుని
ఆముకొన్న పరబ్రహ్మమై వున్నవాఁడు

(॥ఏమని॥)
నెప్పున నీళ్ళతోడి నీలమేఘమై వున్నాఁడు
చప్పుడుగాక పన్నీట జలకమాడి
కప్పురపుమాఁకువలె కడు మించివున్నవాఁడు
ముప్పిరిఁ బచ్చకర్పరమునఁ దొప్పఁదోఁగీ

(॥ఏమని॥)
తట్టుపుణుఁగుభరణి తానైన ట్టున్నవాఁడు
గట్టిగాఁ బుణుఁగు మేనఁ గడు నించుకా
పెట్టినసొమ్ములతోడి పెట్టెవలె నున్నవాఁడు
వొట్టుకొన్న భూషణాలు వొడలెల్లా నిండఁగా

(॥ఏమని॥)
కళలతో లక్ష్మీకాంతుఁడై వున్నవాఁడు
అలమేలుమంగ వురమందు నుండఁగా
యెలమి శ్రీవేంకటేశుఁ డేలికై తా నున్నావాఁడు
నలువంక సర్వలోకనాయకుఁడు గనక

(||pallavi||)
emani talam̐tumamma niṁkā nīdevuni
āmugŏnna parabrahmamai vunnavām̐ḍu

(||emani||)
nĕppuna nīḽḽadoḍi nīlameghamai vunnām̐ḍu
sappuḍugāga pannīḍa jalagamāḍi
kappurabumām̐kuvalĕ kaḍu miṁchivunnavām̐ḍu
muppirim̐ bachchagarbaramunam̐ dŏppam̐dom̐gī

(||emani||)
taṭṭubuṇum̐gubharaṇi tānaina ṭṭunnavām̐ḍu
gaṭṭigām̐ buṇum̐gu menam̐ gaḍu niṁchugā
pĕṭṭinasŏmmuladoḍi pĕṭṭĕvalĕ nunnavām̐ḍu
vŏṭṭugŏnna bhūṣhaṇālu vŏḍalĕllā niṁḍam̐gā

(||emani||)
kaḽalado lakṣhmīgāṁtum̐ḍai vunnavām̐ḍu
alamelumaṁga vuramaṁdu nuṁḍam̐gā
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍeligai tā nunnāvām̐ḍu
naluvaṁka sarvaloganāyagum̐ḍu ganaga