(॥పల్లవి॥)
ఏమని తలఁచితివో ఇందాఁకాను
యేమరఁ జుమ్మీ నేను యిందాఁకాను
(॥ఏమ॥)
తచ్చి తచ్చి యిట్టె నీచిత్తము రావలెనంటాను
యిచ్చకములే యాడితి నిందాఁకాను
పచ్చినీచేఁతలు చూచి పదరఁజాలక నే-
నెచ్చరికతో నుండితి నిందాఁకాను
(॥ఏమ॥)
మదిలోన నీవు నన్ను మన్నింతువంటాను
యెదురెదురే చూచితి నిందాఁకాను
కదిసి నిన్ను మాయింటికడకుఁ బిలిచేనంటా
యిదివో కాచుకుండితి నిందాఁకాను
(॥ఏమ॥)
నెట్టన శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
యెట్టు నిన్ను సొలసితి నిందాఁకాను
గట్టిగా నన్నేలితివి కైవశమై నీవు నాకు
యిట్టిట్టని తెలియును యిందాకాను
(||pallavi||)
emani talam̐sidivo iṁdām̐kānu
yemaram̐ jummī nenu yiṁdām̐kānu
(||ema||)
tachchi tachchi yiṭṭĕ nīsittamu rāvalĕnaṁṭānu
yichchagamule yāḍidi niṁdām̐kānu
pachchinīsem̐talu sūsi padaram̐jālaga ne-
nĕchcharigado nuṁḍidi niṁdām̐kānu
(||ema||)
madilona nīvu nannu manniṁtuvaṁṭānu
yĕdurĕdure sūsidi niṁdām̐kānu
kadisi ninnu māyiṁṭigaḍagum̐ bilisenaṁṭā
yidivo kāsuguṁḍidi niṁdām̐kānu
(||ema||)
nĕṭṭana śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
yĕṭṭu ninnu sŏlasidi niṁdām̐kānu
gaṭṭigā nannelidivi kaivaśhamai nīvu nāgu
yiṭṭiṭṭani tĕliyunu yiṁdāgānu