Emani talamsavachchu niduvamti neesi ttamu

ఏమని తలఁచవచ్చు నిటువంటి నీచి త్తము
Language

(॥పల్లవి॥)
ఏమని తలఁచవచ్చు నిటువంటి నీచి త్తము
దీమసాన నీభావము తెలియ దెవ్వరికి

(॥ఏమ॥)
రవిచంద్ర్రగ్రహ తారకములకుఁ దెరువు
వివరించనున్నదా నీవే యాధారముగాక
పవనునికి భువికి పదునాల్గులోకముల-
కవల వేరొకచోట నాధార మున్నదా

(॥ఏమ॥)
తిలకింపఁ గులాచలదిగ్గజశేషాదులకు
నిలువఁ జోటున్నదా నీవే యాధారము గాక
నలుదిక్కులకు గగనమునకు మేఘాలకు
కలది నీయాధారమే కాక వేర వున్నదా

(॥ఏమ॥)
అనంతబ్రహ్మాండముల కట్టే నీరూపములకు
వెనకముందున్నదా నీవే యాధారముగాక
వినుతి కెక్కిన శ్రీవేంకటేశ నీకు నీవే
మనికైన యాధారము మఱి యెంచ నున్నదా

(||pallavi||)
emani talam̐savachchu niḍuvaṁṭi nīsi ttamu
dīmasāna nībhāvamu tĕliya dĕvvarigi

(||ema||)
ravisaṁdrragraha tāragamulagum̐ dĕruvu
vivariṁchanunnadā nīve yādhāramugāga
pavanunigi bhuvigi padunālgulogamula-
kavala verŏgasoḍa nādhāra munnadā

(||ema||)
tilagiṁpam̐ gulāsaladiggajaśheṣhādulagu
niluvam̐ joḍunnadā nīve yādhāramu gāga
naludikkulagu gaganamunagu meghālagu
kaladi nīyādhārame kāga vera vunnadā

(||ema||)
anaṁtabrahmāṁḍamula kaṭṭe nīrūbamulagu
vĕnagamuṁdunnadā nīve yādhāramugāga
vinudi kĕkkina śhrīveṁkaḍeśha nīgu nīve
manigaina yādhāramu maṟi yĕṁcha nunnadā