Emani talamsavachchu nevvarim gaadanavachchu

ఏమని తలఁచవచ్చు నెవ్వరిఁ గాదనవచ్చు
Language

(॥పల్లవి॥)
ఏమని తలఁచవచ్చు నెవ్వరిఁ గాదనవచ్చు
కామించేవారి వారి కర్మఫలమహిమ

(॥ఏమని॥)
చల్లనే చందురుఁడు సర్వమైన వారికి
వెల్లివిరి విరహికి వెట్టయైతోఁచు
యెల్లవారికి నన్న మిలఁ బ్రాణమై వుండు
నల్లన రోగికిఁ దానే యరుచియై తోఁచును

(॥ఏమని॥)
పమ్మిన సంపంగిపూవు పరిమళ మందరికి
తుమ్మిదకే విరసమై తోఁచుఁ గాని
వుమ్మడి సూర్యుఁ డెప్పుడు నొగి లోకబాంధవుఁడు
కమ్మి కలువలకే కడుఁ బగయి తోఁచును

(॥ఏమని॥)
శ్రీవేంకటేశుఁడు శిష్ట్ల కెల్లాఁ బ్రియుఁడు
భావింపఁగ దుష్ట్ల కే భయంకరుఁడు
పావనపు హరినామపఠనపుణ్యుల మెచ్చు
యీవలావలి మూర్ఖుల కెరవయి తోఁచును

(||pallavi||)
emani talam̐savachchu nĕvvarim̐ gādanavachchu
kāmiṁchevāri vāri karmaphalamahima

(||emani||)
sallane saṁdurum̐ḍu sarvamaina vārigi
vĕlliviri virahigi vĕṭṭayaidom̐su
yĕllavārigi nanna milam̐ brāṇamai vuṁḍu
nallana rogigim̐ dāne yarusiyai tom̐sunu

(||emani||)
pammina saṁpaṁgibūvu parimaḽa maṁdarigi
tummidage virasamai tom̐sum̐ gāni
vummaḍi sūryum̐ ḍĕppuḍu nŏgi logabāṁdhavum̐ḍu
kammi kaluvalage kaḍum̐ bagayi tom̐sunu

(||emani||)
śhrīveṁkaḍeśhum̐ḍu śhiṣhṭla kĕllām̐ briyum̐ḍu
bhāviṁpam̐ga duṣhṭla ke bhayaṁkarum̐ḍu
pāvanabu harināmabaṭhanabuṇyula mĕchchu
yīvalāvali mūrghula kĕravayi tom̐sunu