ఏమని తా భావించునో యెరఁగ నేను
(॥పల్లవి॥)
ఏమని తా భావించునో యెరఁగ నేను
చీమక(ల?) దొంతరమేలు చిమ్మి రేఁగెననవే
(॥॥)
అప్పుడే వచ్చేనంటి నటు నావిభునితోడ
అప్పస మెవ్వతుండునో యని మానితి
కప్పుర మంపేనంటిఁ గదియ నీవిరహన
వుప్పతిల్లుఁ దాపమంటా నూరకుంటివి
(॥॥)
వీడేమిచ్చి యంపేనంటి వెలఁదిచేతఁ దనకు
ఆడ వేళదెలియక అంపనైతిని
వేడుక విరులబంతి వేసేనంటా నుంటి
ఆడ నవి మరునమ్ము లవునని మానితి
(॥॥)
కాఁగిటఁ గూడినవేళఁ గళలు రేఁచేనంటి
మాఁగినరతుల నేనే మఱచితిని
చేఁగదేర నన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁడు వచ్చి
దాఁగనినవ్వులు నేనే తనమీఁదఁ జల్లితి
(||pallavi||)
emani tā bhāviṁchuno yĕram̐ga nenu
sīmaga(la?) dŏṁtaramelu simmi rem̐gĕnanave
(||||)
appuḍe vachchenaṁṭi naḍu nāvibhunidoḍa
appasa mĕvvaduṁḍuno yani mānidi
kappura maṁpenaṁṭim̐ gadiya nīvirahana
vuppadillum̐ dābamaṁṭā nūraguṁṭivi
(||||)
vīḍemichchi yaṁpenaṁṭi vĕlam̐disedam̐ danagu
āḍa veḽadĕliyaga aṁpanaidini
veḍuga virulabaṁti vesenaṁṭā nuṁṭi
āḍa navi marunammu lavunani mānidi
(||||)
kām̐giḍam̐ gūḍinaveḽam̐ gaḽalu rem̐senaṁṭi
mām̐ginaradula nene maṟasidini
sem̐gadera nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu vachchi
dām̐ganinavvulu nene tanamīm̐dam̐ jallidi