Emani seppudune yimtiro naa muchchadalu

ఏమని చెప్పుదునే యింతిరో నా ముచ్చటలు
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పుదునే యింతిరో నా ముచ్చటలు
సాములుసేసె నాతో సరసపు విభుఁడు

(॥ఏమ॥)
కన్నులఁదాఁ జూచితేను కరఁగె నామనసు
సన్నలు మోవిఁజేసితే చవులు రేఁగె
చన్నులు చేతనవంటితే జలజలఁ జెమరించె
యిన్నేసిచేఁతలు సేసె నేకతాన విభుఁడు

(॥ఏమ॥)
వొడిపట్టుకుండితేను వుమ్మగిలె వలపులు
విడెమిచ్చితే నెంతోవేడుకాయను
తడవి మాటాడితేను తమకము లుప్పతిల్లె
బడి నుండి యింతసేసె పాయపునావిభుఁడు

(॥ఏమ॥)
గక్కనఁగాఁగిలించితే కాయ మెల్లాఁ బులకించె
వుక్కుగోరు సోఁకించితే సుబ్బెఁ గళలు
మక్కువతోఁ గూడితేను మర్మములు గుబ్బతిల్లె
చెక్కు నొక్కి రట్టుసేసె శ్రీవేంకటవిభుఁడు

(||pallavi||)
emani sĕppudune yiṁtiro nā muchchaḍalu
sāmulusesĕ nādo sarasabu vibhum̐ḍu

(||ema||)
kannulam̐dām̐ jūsidenu karam̐gĕ nāmanasu
sannalu movim̐jeside savulu rem̐gĕ
sannulu sedanavaṁṭide jalajalam̐ jĕmariṁchĕ
yinnesisem̐talu sesĕ negadāna vibhum̐ḍu

(||ema||)
vŏḍibaṭṭuguṁḍidenu vummagilĕ valabulu
viḍĕmichchide nĕṁtoveḍugāyanu
taḍavi māḍāḍidenu tamagamu luppadillĕ
baḍi nuṁḍi yiṁtasesĕ pāyabunāvibhum̐ḍu

(||ema||)
gakkanam̐gām̐giliṁchide kāya mĕllām̐ bulagiṁchĕ
vukkugoru som̐kiṁchide subbĕm̐ gaḽalu
makkuvadom̐ gūḍidenu marmamulu gubbadillĕ
sĕkku nŏkki raṭṭusesĕ śhrīveṁkaḍavibhum̐ḍu