Emani seppudune yiduvamti vedugalu

ఏమని చెప్పుదునే యిటువంటి వేడుకలు
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పుదునే యిటువంటి వేడుకలు
కామించి యాతఁడు నాకు కడుఁ జవి చూపెను

(॥ఏమని॥)
తెరదీసి యాసలతో దిష్టించి చూచిన చూపు
వరుస నవ్వనిమో మివ్వలైననవ్వు
పరువము దప్పకుండా పాసి కూడినకూటమి
సరుగ నిండునిగ్గులు జారినప్పటిరీతి

(॥ఏమని॥)
కొంచక వొట్లువెట్టుకోఁగా వేఁడుకొనుటలు
మించి యలుకదీరినమీఁదిమాటలు
అంచవసంతము వేట్లాడేకౌఁగిలి
యెంచి నాలునాళ్లు చేసి యెనయునాఁ టితమి

(॥ఏమని॥)
జడియక సురతము సలిపినమీఁదినిద్ర
యెడమాట లాడించే వొడఁబాట్లు
అడరి శ్రీవేంకటేశుఁ డన్నిటా నన్ను నేలి
యెడయని వలపుల యింపులు వుట్టించెనే

(||pallavi||)
emani sĕppudune yiḍuvaṁṭi veḍugalu
kāmiṁchi yādam̐ḍu nāgu kaḍum̐ javi sūbĕnu

(||emani||)
tĕradīsi yāsalado diṣhṭiṁchi sūsina sūbu
varusa navvanimo mivvalainanavvu
paruvamu dappaguṁḍā pāsi kūḍinagūḍami
saruga niṁḍuniggulu jārinappaḍirīdi

(||emani||)
kŏṁchaga vŏṭluvĕṭṭugom̐gā vem̐ḍugŏnuḍalu
miṁchi yalugadīrinamīm̐dimāḍalu
aṁchavasaṁtamu veṭlāḍegaum̐gili
yĕṁchi nālunāḽlu sesi yĕnayunām̐ ṭidami

(||emani||)
jaḍiyaga suradamu salibinamīm̐dinidra
yĕḍamāḍa lāḍiṁche vŏḍam̐bāṭlu
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍanniḍā nannu neli
yĕḍayani valabula yiṁpulu vuṭṭiṁchĕne