ఏమని చెప్పుదునే యీతని జాణతనము
(॥పల్లవి॥)
ఏమని చెప్పుదునే యీతని జాణతనము
నాము దేర నూరకిట్టె నవ్వించీనే
(॥ఏమ॥)
సిగ్గువడి తనవద్ద శిరసు నే వంచుకొంటే
బగ్గన నామోము తప్పక చూచీనే
అగ్గలపు మోహముతో నరమరచి నేనుంటే
బుగ్గలాంటి నామేను పులకింపించీనే
(॥ఏమ॥)
కడుఁదమకములఁగాఁ కల నేనుండఁగ నాకు-
మడిచియిచ్చి మేను చమరింపించీనే
బడిఁ బాన్పుపై నలసి పవ్వళించి వుండఁగాను
నిడివి నాకళ్ల లంటి నిద్దిరింపించీనే
(॥ఏమ॥)
అంగవించి తనరతి కడ్డమాడకుండఁగాను
చెంగట నందంద మెచ్చి చెక్కునొక్కీనే
యింగితాన శ్రీవేంకటేశు డిట్టె నన్నుఁ గూడె
కొంగువట్టితీసి నన్నుఁ గొసరింపించీనే
(||pallavi||)
emani sĕppudune yīdani jāṇadanamu
nāmu dera nūragiṭṭĕ navviṁchīne
(||ema||)
sigguvaḍi tanavadda śhirasu ne vaṁchugŏṁṭe
baggana nāmomu tappaga sūsīne
aggalabu mohamudo naramarasi nenuṁṭe
buggalāṁṭi nāmenu pulagiṁpiṁchīne
(||ema||)
kaḍum̐damagamulam̐gām̐ kala nenuṁḍam̐ga nāgu-
maḍisiyichchi menu samariṁpiṁchīne
baḍim̐ bānpubai nalasi pavvaḽiṁchi vuṁḍam̐gānu
niḍivi nāgaḽla laṁṭi niddiriṁpiṁchīne
(||ema||)
aṁgaviṁchi tanaradi kaḍḍamāḍaguṁḍam̐gānu
sĕṁgaḍa naṁdaṁda mĕchchi sĕkkunŏkkīne
yiṁgidāna śhrīveṁkaḍeśhu ḍiṭṭĕ nannum̐ gūḍĕ
kŏṁguvaṭṭidīsi nannum̐ gŏsariṁpiṁchīne