Emani seppudunammaa itti naa praanavibhumdu

ఏమని చెప్పుదునమ్మా ఇట్టి నా ప్రాణవిభుఁడు
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పుదునమ్మా ఇట్టి నా ప్రాణవిభుఁడు
నా మీఁదఁ జేసే మన్నన నా దేహమెరుఁగును

(॥ఏమని॥)
తప్పక చూచినచూపు తగులనాడినమాట
యెప్పటికి మరవరాదేమి సేతునే
ముప్పిరి నవ్విన నవ్వు మొక్కలపుఁ జెనకులు
తిప్పరాని మోహమాయ తెగదే యిద్దరికిని

(॥ఏమని॥)
కొనవేలనూఁదినది కొంగువట్టి తీసినది
మనసులోనెన్నటికి మరవరాదే
చనవు నాకిచ్చినది జారుఁగొప్పు దువ్వినది
తనివోనియాసలకు తరవాయఁ గదవే

(॥ఏమని॥)
దగ్గరి వచ్చినరాక తమితోఁజేసినచేఁత
సిగ్గువెల్లఁ బెడఁ బాపె చెప్పనేఁటికే
అగ్గమై శ్రీ వేంకటేశుఁడాయమంటి నన్నుఁ గూడె
తగ్గులేని గతులకు తతులాయ నిదివో

(||pallavi||)
emani sĕppudunammā iṭṭi nā prāṇavibhum̐ḍu
nā mīm̐dam̐ jese mannana nā dehamĕrum̐gunu

(||emani||)
tappaga sūsinasūbu tagulanāḍinamāḍa
yĕppaḍigi maravarādemi sedune
muppiri navvina navvu mŏkkalabum̐ jĕnagulu
tipparāni mohamāya tĕgade yiddarigini

(||emani||)
kŏnavelanūm̐dinadi kŏṁguvaṭṭi tīsinadi
manasulonĕnnaḍigi maravarāde
sanavu nāgichchinadi jārum̐gŏppu duvvinadi
tanivoniyāsalagu taravāyam̐ gadave

(||emani||)
daggari vachchinarāga tamidom̐jesinasem̐ta
sigguvĕllam̐ bĕḍam̐ bābĕ sĕppanem̐ṭige
aggamai śhrī veṁkaḍeśhum̐ḍāyamaṁṭi nannum̐ gūḍĕ
tagguleni gadulagu tadulāya nidivo