ఏమని చెప్పుదుమయ్యా ఇంతి నీపైగల బత్తి
(॥పల్లవి॥)
ఏమని చెప్పుదుమయ్యా ఇంతి నీపైగల బత్తి
నేమానఁ బూనుక వచ్చీ నీకుఁ గానేయిపుడు
(॥ఏమ॥)
నిడువాలుఁ జూపు చూచి నీమనసు నాటెనని
పొడిఁబడీ నంతలోనె పొలఁతి
కడునవ్వఁగా నీకుఁ గాఁక రేఁగెనోయని
వుడివోని తలపోఁత నుస్సురనీని
(॥ఏమ॥)
మచ్చిక మాటాడి నీమర్మము సోఁకెనోయని
కొచ్చి కొచ్చి లోలోనె కొంకీఁ జెలి
తచ్చి గుబ్బల నొత్తఁగా తనువు నొచ్చెనోయని
విచ్చనవిడి నప్పుడే వెరగందీని
(॥ఏమ॥)
నిన్ను వేగినంతాఁ గూడి నిద్దురలేదోయని
కన్నులు దేలగింపుచుఁ గాఁతాళించీని
ఇన్నిటా శ్రీవేంకటేశ యీపె నీవురమెక్కి
సన్నలా చాయలా నీకు సారె మొక్కీని
(||pallavi||)
emani sĕppudumayyā iṁti nībaigala batti
nemānam̐ būnuga vachchī nīgum̐ gāneyibuḍu
(||ema||)
niḍuvālum̐ jūbu sūsi nīmanasu nāḍĕnani
pŏḍim̐baḍī naṁtalonĕ pŏlam̐ti
kaḍunavvam̐gā nīgum̐ gām̐ka rem̐gĕnoyani
vuḍivoni talabom̐ta nussuranīni
(||ema||)
machchiga māḍāḍi nīmarmamu som̐kĕnoyani
kŏchchi kŏchchi lolonĕ kŏṁkīm̐ jĕli
tachchi gubbala nŏttam̐gā tanuvu nŏchchĕnoyani
vichchanaviḍi nappuḍe vĕragaṁdīni
(||ema||)
ninnu veginaṁtām̐ gūḍi nidduraledoyani
kannulu delagiṁpusum̐ gām̐tāḽiṁchīni
inniḍā śhrīveṁkaḍeśha yībĕ nīvuramĕkki
sannalā sāyalā nīgu sārĕ mŏkkīni