Emani seppudumayya yidivo nee bhaagyamu

ఏమని చెప్పుదుమయ్య యిదివో నీ భాగ్యము
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పుదుమయ్య యిదివో నీ భాగ్యము
భామ వేడుకలు నీకు నామనై నిలిచెను

(॥॥)
చెలి మేనఁ గురిసేటి చెమటల వానకు
మొలచెఁ జిరునవ్వులు మోసులెత్తి
చలువమంచితనాలు జవ్వనము పంట వండి
కొలఁదిలేనిచన్నుల గొప్పరాసులాయను

(॥॥)
కలికిమోముననున్న కారు మెఱుఁగులకును
జలజలఁ బల్కుఁదేనె జడివట్టెను
యెలమి సింగార రసమేరులు నిండాఁ బారి
తలపోఁతచెరువుల దైవారె మరవలు

(॥॥)
ఆలమేలుమంగమోహమనేసోనలు ముంచి
పలువిధములరతుల పదనెక్కెను
యెలమి శ్రీ వేంకటేశ యెదురీతఁకాగిఁట
వులివచ్చి యానందాన నూటులెత్తును

(||pallavi||)
emani sĕppudumayya yidivo nī bhāgyamu
bhāma veḍugalu nīgu nāmanai nilisĕnu

(||||)
sĕli menam̐ guriseḍi sĕmaḍala vānagu
mŏlasĕm̐ jirunavvulu mosulĕtti
saluvamaṁchidanālu javvanamu paṁṭa vaṁḍi
kŏlam̐dilenisannula gŏpparāsulāyanu

(||||)
kaligimomunanunna kāru mĕṟum̐gulagunu
jalajalam̐ balgum̐denĕ jaḍivaṭṭĕnu
yĕlami siṁgāra rasamerulu niṁḍām̐ bāri
talabom̐tasĕruvula daivārĕ maravalu

(||||)
ālamelumaṁgamohamanesonalu muṁchi
paluvidhamularadula padanĕkkĕnu
yĕlami śhrī veṁkaḍeśha yĕdurīdam̐kāgim̐ṭa
vulivachchi yānaṁdāna nūḍulĕttunu