ఏమని చెప్పుదుమయ్య యీపె వలపు
(॥పల్లవి॥)
ఏమని చెప్పుదుమయ్య యీపె వలపు
నీ మేని రతులఁ జొక్కి నేర మెంచీ నిపుడు
(॥ఏ మని॥)
అద్దము చూచి చెలి యంతలేనో నవ్వు నవ్వి
గద్దరిచూపుల నీ మొగము చూచెను
యిద్దరుఁ గూడి యున్నప్పు డెరఁగ దాయనో కాని
చద్దిగురుతులకే సాధించీ నిపుడు
(॥ఏమని॥)
పొలిఁతి బాగా లందుక పుక్కిట నీ విడినట్టి
తొలుతటితమ్మ చూచి తల వంచెను
కలసినప్పటివేళ గతు లెట్చుండెనో కాని
సొలసి యందుకుఁ గానె సూడి వట్టీ నిపుడు
(॥ఏమని॥)
పవళించఁ బోయి నీవే పర మయి వుండఁగఁ జెలి
జవళివేడుకలకు సంతంసించెను
యివల శ్రీవెంకటేశ యే మని మెచ్చెనో కాని
కవ గూడి మన్ననల మించీ నిపుడూ
(||pallavi||)
emani sĕppudumayya yībĕ valabu
nī meni radulam̐ jŏkki nera mĕṁchī nibuḍu
(||e mani||)
addamu sūsi sĕli yaṁtaleno navvu navvi
gaddarisūbula nī mŏgamu sūsĕnu
yiddarum̐ gūḍi yunnappu ḍĕram̐ga dāyano kāni
saddigurudulage sādhiṁchī nibuḍu
(||emani||)
pŏlim̐ti bāgā laṁduga pukkiḍa nī viḍinaṭṭi
tŏludaḍidamma sūsi tala vaṁchĕnu
kalasinappaḍiveḽa gadu lĕṭchuṁḍĕno kāni
sŏlasi yaṁdugum̐ gānĕ sūḍi vaṭṭī nibuḍu
(||emani||)
pavaḽiṁcham̐ boyi nīve para mayi vuṁḍam̐gam̐ jĕli
javaḽiveḍugalagu saṁtaṁsiṁchĕnu
yivala śhrīvĕṁkaḍeśha ye mani mĕchchĕno kāni
kava gūḍi mannanala miṁchī nibuḍū