ఏమని చెప్పుదుఁ జెలి యిటవలె నున్నది తమకము
(॥పల్లవి॥)
ఏమని చెప్పుదుఁ జెలి యిటవలె నున్నది తమకము
కాముకులకు మరుఁ డెటువలె గల్పించెనో కాని
(॥ఏమని॥)
తలఁపునఁ బారును కౌఁగిట తా ననుఁ గూడినకూటమి
కలపలెఁ దోఁ చును యేరీతి కళవళమో కాని
పిలిచినయటువలె నుండును పేర్కొని నే నాలకించిన
వలపులు నాఁటిన నా భావము తగులో కాని
(॥ఏమని॥)
వినినటువలెనే వుండును వీనులకునుఁ దనమాటలు
చెనకిన విధమౌ నా మచ్చికమరులో కాని
కనినటువలె నౌఁ దను నెక్కడ మొగమై చూచిన
అనిశము నేమును మరిగియాందోళమో కాని
(॥ఏమని॥)
పక్కనే వున్నటు లుండును పానుపుపైఁ దా నెప్పుడు
అక్కున నలమే యప్పటి యలవాటో కాని
నిక్కము శ్రీవేంకటేశుఁడు నేనే యలమేల్మంగను
దక్కెను నా నోముఘలము తా నాయనో కాని
(||pallavi||)
emani sĕppudum̐ jĕli yiḍavalĕ nunnadi tamagamu
kāmugulagu marum̐ ḍĕḍuvalĕ galbiṁchĕno kāni
(||emani||)
talam̐punam̐ bārunu kaum̐giḍa tā nanum̐ gūḍinagūḍami
kalabalĕm̐ dom̐ sunu yerīdi kaḽavaḽamo kāni
pilisinayaḍuvalĕ nuṁḍunu pergŏni ne nālagiṁchina
valabulu nām̐ṭina nā bhāvamu tagulo kāni
(||emani||)
vininaḍuvalĕne vuṁḍunu vīnulagunum̐ danamāḍalu
sĕnagina vidhamau nā machchigamarulo kāni
kaninaḍuvalĕ naum̐ danu nĕkkaḍa mŏgamai sūsina
aniśhamu nemunu marigiyāṁdoḽamo kāni
(||emani||)
pakkane vunnaḍu luṁḍunu pānububaim̐ dā nĕppuḍu
akkuna nalame yappaḍi yalavāḍo kāni
nikkamu śhrīveṁkaḍeśhum̐ḍu nene yalamelmaṁganu
dakkĕnu nā nomughalamu tā nāyano kāni