Emani seppudu niruguborugudo

ఏమని చెప్పుదు నిరుగుపొరుగుతో
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పుదు నిరుగుపొరుగుతో
గామిడితనమునఁ గదిసీని

(॥ఏమ॥)
మలయుచు నే నటు మంద కేఁగఁగా
తొలఁగక యెదురుగఁదుమ్మీని
యెలిమి మగుడి మాయింటికిఁ బోతే
బెళకక యిలు గడెవెట్టీని

(॥ఏమ॥)
జడిగొని వీదుల చల్లలమ్మఁగా
తొడిఁబడ దూడలఁదోలీని
వడి నందుకు నేవద్దని కసరిన
ఆడరి జాణతన మాడీని

(॥ఏమ॥)
ఏకతమున నే నిటు నీళ్ళాడఁగ
కైకొని నాచీర గట్టీని
కాకుగ శ్రీవేంకటగిరి కృష్టుఁడు
దాకొని నన్నిటు తగఁ గూడీని

(||pallavi||)
emani sĕppudu nirugubŏrugudo
gāmiḍidanamunam̐ gadisīni

(||ema||)
malayusu ne naḍu maṁda kem̐gam̐gā
tŏlam̐gaga yĕdurugam̐dummīni
yĕlimi maguḍi māyiṁṭigim̐ bode
bĕḽagaka yilu gaḍĕvĕṭṭīni

(||ema||)
jaḍigŏni vīdula sallalammam̐gā
tŏḍim̐baḍa dūḍalam̐dolīni
vaḍi naṁdugu nevaddani kasarina
āḍari jāṇadana māḍīni

(||ema||)
egadamuna ne niḍu nīḽḽāḍam̐ga
kaigŏni nāsīra gaṭṭīni
kāguga śhrīveṁkaḍagiri kṛṣhṭum̐ḍu
dāgŏni nanniḍu tagam̐ gūḍīni