Emani seppudu meege vilaasamu

ఏమని చెప్పుదు మీకె విలాసము
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పుదు మీకె విలాసము
దోమటి సరసము దొంతరలాయ

(॥ఏమ॥)
తీగెలుసాగీ తెఱవ యెలుఁగుల
సోగమోమునను సొలపడరె
చేగలుదేరీ చెంగలిచూపుల
బాగుల రమణునిబాగ్యంబాయ

(॥ఏమ॥)
తేనెలుగారీ తియ్యనిమాఁటల
నానీ సెలవుల నవ్వునివె
వానలఁ జెమటలు వడిపీఁ జెక్కుల
వూనినవిభునికి నుచితంబాయ

(॥ఏమ॥)
ముప్పిరిఁదొలఁకీ మోవిరసంబులు
కొప్పులోన నవె కుసుమములు
యిప్పుడు శ్రీవేంకటేశుఁడు గూడఁగ
చొప్పుగ నితనికి సోబనమాయ

(||pallavi||)
emani sĕppudu mīgĕ vilāsamu
domaḍi sarasamu dŏṁtaralāya

(||ema||)
tīgĕlusāgī tĕṟava yĕlum̐gula
sogamomunanu sŏlabaḍarĕ
segaluderī sĕṁgalisūbula
bāgula ramaṇunibāgyaṁbāya

(||ema||)
tenĕlugārī tiyyanimām̐ṭala
nānī sĕlavula navvunivĕ
vānalam̐ jĕmaḍalu vaḍibīm̐ jĕkkula
vūninavibhunigi nusidaṁbāya

(||ema||)
muppirim̐dŏlam̐kī movirasaṁbulu
kŏppulona navĕ kusumamulu
yippuḍu śhrīveṁkaḍeśhum̐ḍu gūḍam̐ga
sŏppuga nidanigi sobanamāya