Emani seppudame yiddari bhaavamulunu

ఏమని చెప్పుదమే యిద్దరి భావములును
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పుదమే యిద్దరి భావములును
ప్రేమము లీరూపములై పెనఁగఁజొచ్చినవి

(॥ఏమని॥)
కోపగించుకొని రాఁగా కొంగువట్టి రమణుఁడు
వోప నంటే పెనఁగీనే వొయ్యనే చెలి
పై పైఁ గౌఁగిటఁ బెట్టి బలిమిసేయఁగఁ బోఁగా
తీపులపెదవి వంచి తిట్టీ నతనిని

(॥ఏమని॥)
పెదవి గొణఁగుకోంగా ప్రియుఁ డాకెఁ జెక్కు నొక్కి
చెదర నాడుక లోనై చిక్కెఁ జెలి
మొదలఁ గోలుముందుగ మోవి గంటి సేసే నాతఁ
డదివో చురుకుఁ జూపు లాకె చల్లీ మీఁదను

(॥ఏమని॥)
పక్కన నానవెట్టఁగ పానుపుపైఁ బడవేసి
చొక్కుచుఁ గరఁగుతానే సొలసీఁ జెలి
యిక్కువైన శ్రీవేంకటేశుఁడు గూడె నిట్టే
ముక్కుమీఁదివేలితోన మోనమున నున్నది

(||pallavi||)
emani sĕppudame yiddari bhāvamulunu
premamu līrūbamulai pĕnam̐gam̐jŏchchinavi

(||emani||)
kobagiṁchugŏni rām̐gā kŏṁguvaṭṭi ramaṇum̐ḍu
voba naṁṭe pĕnam̐gīne vŏyyane sĕli
pai paim̐ gaum̐giḍam̐ bĕṭṭi balimiseyam̐gam̐ bom̐gā
tībulabĕdavi vaṁchi tiṭṭī nadanini

(||emani||)
pĕdavi gŏṇam̐gugoṁgā priyum̐ ḍāgĕm̐ jĕkku nŏkki
sĕdara nāḍuga lonai sikkĕm̐ jĕli
mŏdalam̐ golumuṁduga movi gaṁṭi sese nādam̐
ḍadivo surugum̐ jūbu lāgĕ sallī mīm̐danu

(||emani||)
pakkana nānavĕṭṭam̐ga pānububaim̐ baḍavesi
sŏkkusum̐ garam̐gudāne sŏlasīm̐ jĕli
yikkuvaina śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ niṭṭe
mukkumīm̐divelidona monamuna nunnadi