ఏమని చెప్పుదమే ఇద్దరి భావములును
(॥పల్లవి॥)
ఏమని చెప్పుదమే ఇద్దరి భావములును
ప్రేమము లీరూపములై పెనఁగఁగఁ జొచ్చినవి
(॥॥)
కోపగించుకొని రాఁగా కొంగువట్టీ రమణుఁడు
వోపనంటేఁ బెనఁగీనే వొయ్యనే చెలి
పైపై కాఁగిటఁబట్టి బలిమి సేయఁగఁబోఁగా
తీపుల పెదవి వంచి తిట్టీ నతనిని
(॥॥)
పెదవి గొణఁగుకోఁగా ప్రియుఁ డాకెచెక్కు నొక్కె
చెదర నాడుత లోనై చిక్కీఁ జెలి
మొదలఁ గోలుముందుగ మోవి గంటిసేసే నాడ
అదివో చురుముఁ జూపు లాకె చల్లీ మీఁదను
(॥॥)
పక్కన నానవెట్టఁగ పానుపుపైఁ బడవేసీ
చొక్కుచుఁ గరఁగి తానే సొలసీఁ జెలి
యిక్కువైన శ్రీ వేంకటేశుఁడు గూడె నిట్టె
ముక్కుమీఁది వేలితోన మోనమున నున్నది
(||pallavi||)
emani sĕppudame iddari bhāvamulunu
premamu līrūbamulai pĕnam̐gam̐gam̐ jŏchchinavi
(||||)
kobagiṁchugŏni rām̐gā kŏṁguvaṭṭī ramaṇum̐ḍu
vobanaṁṭem̐ bĕnam̐gīne vŏyyane sĕli
paibai kām̐giḍam̐baṭṭi balimi seyam̐gam̐bom̐gā
tībula pĕdavi vaṁchi tiṭṭī nadanini
(||||)
pĕdavi gŏṇam̐gugom̐gā priyum̐ ḍāgĕsĕkku nŏkkĕ
sĕdara nāḍuda lonai sikkīm̐ jĕli
mŏdalam̐ golumuṁduga movi gaṁṭisese nāḍa
adivo surumum̐ jūbu lāgĕ sallī mīm̐danu
(||||)
pakkana nānavĕṭṭam̐ga pānububaim̐ baḍavesī
sŏkkusum̐ garam̐gi tāne sŏlasīm̐ jĕli
yikkuvaina śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ niṭṭĕ
mukkumīm̐di velidona monamuna nunnadi