Emani seppudamamma yeedani saubhaagyamu

ఏమని చెప్పుదమమ్మ యీతని సౌభాగ్యము
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పుదమమ్మ యీతని సౌభాగ్యము
కోమలపు జవ్వనము గురుతై నట్టుండె

(॥ఏమ॥)
వొట్టుచుఁ గప్పురకాపు వూడిగపురవారెల్ల
అట్టె దేవునికి నలఁదఁగాను
దట్టముగ మంచితెల్లఁదా మోరపూవునను
ముట్టి అవయవముల(లు?) మొలచినట్టుండె

(॥ఏమ॥)
తనివొంది గిన్నెలతోఁ దట్టుపుణుఁగులు దెచ్చి
పానుపొందఁ దిరుమేనఁ బుయ్యఁగాను
పనివడి గొప్ప నిడుపాటి నేరేడుఁబండు
కనుపట్ట పురుషాకారమైనట్టుండె

(॥ఏమ॥)
అలమేలుమంగ నురమందుఁబెట్టి సొమ్ములెల్లా
పలువిధముల నించి భావించఁగాను
అలర శ్రీవేంకటేశుఁ డనెడి పుప్పొడిరాశి
వెలయ మరుఁడు ముద్రవేసినయట్టుండె

(||pallavi||)
emani sĕppudamamma yīdani saubhāgyamu
komalabu javvanamu gurudai naṭṭuṁḍĕ

(||ema||)
vŏṭṭusum̐ gappuragābu vūḍigaburavārĕlla
aṭṭĕ devunigi nalam̐dam̐gānu
daṭṭamuga maṁchidĕllam̐dā morabūvunanu
muṭṭi avayavamula(lu?) mŏlasinaṭṭuṁḍĕ

(||ema||)
tanivŏṁdi ginnĕladom̐ daṭṭubuṇum̐gulu dĕchchi
pānubŏṁdam̐ dirumenam̐ buyyam̐gānu
panivaḍi gŏppa niḍubāḍi nereḍum̐baṁḍu
kanubaṭṭa puruṣhāgāramainaṭṭuṁḍĕ

(||ema||)
alamelumaṁga nuramaṁdum̐bĕṭṭi sŏmmulĕllā
paluvidhamula niṁchi bhāviṁcham̐gānu
alara śhrīveṁkaḍeśhum̐ ḍanĕḍi puppŏḍirāśhi
vĕlaya marum̐ḍu mudravesinayaṭṭuṁḍĕ