Emani seppudamamma yeedani saubhaagyamu

ఏమని చెప్పుదమమ్మ యీతని సౌభాగ్యము
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పుదమమ్మ యీతని సౌభాగ్యము
కోమలపు జవ్వనము గుఱుతైనట్లుండే

(॥ఏమని॥)
వొట్టుచుఁ గప్పురకాపు వూడిగపుఁవారెల్లా
అట్టే దేవునికి నలఁదఁగాను
దట్టముగ మంచి తెల్లఁ దామెరపవ్వునకు
ముట్టి అవయవములు మొలచిన ట్టుండే

(॥ఏమని॥)
తనివొంద గిన్నెలతోఁ దట్టుపుణుఁగులు దెచ్చి
పొనుపొందఁ దిరుమేనఁ బుయ్యఁగాను
పనివడి గొప్ప నిడుపాటి నేరేడుఁబండు
కనుపట్ట పురుషాకారమైన ట్లుండే

(॥ఏమని॥)
అలమేలుమంగ నురమందుఁ బెట్టి సొమ్ము లెల్లా
పలువిధముల నించి భావించఁగాను
అలర శ్రీవేంకటేశుఁడనెడి పుప్పొడి రాసి
వెలయు మరుఁడు ముద్ర వేసిన ట్లుండే

(||pallavi||)
emani sĕppudamamma yīdani saubhāgyamu
komalabu javvanamu guṟudainaṭluṁḍe

(||emani||)
vŏṭṭusum̐ gappuragābu vūḍigabum̐vārĕllā
aṭṭe devunigi nalam̐dam̐gānu
daṭṭamuga maṁchi tĕllam̐ dāmĕrabavvunagu
muṭṭi avayavamulu mŏlasina ṭṭuṁḍe

(||emani||)
tanivŏṁda ginnĕladom̐ daṭṭubuṇum̐gulu dĕchchi
pŏnubŏṁdam̐ dirumenam̐ buyyam̐gānu
panivaḍi gŏppa niḍubāḍi nereḍum̐baṁḍu
kanubaṭṭa puruṣhāgāramaina ṭluṁḍe

(||emani||)
alamelumaṁga nuramaṁdum̐ bĕṭṭi sŏmmu lĕllā
paluvidhamula niṁchi bhāviṁcham̐gānu
alara śhrīveṁkaḍeśhum̐ḍanĕḍi puppŏḍi rāsi
vĕlayu marum̐ḍu mudra vesina ṭluṁḍe