ఏమని చెప్పేనే యిట్టి నావలపు
(॥పల్లవి॥)
ఏమని చెప్పేనే యిట్టి నావలపు
ఆమీఁదటి పనులతఁడే యెఱుఁగు
(॥ఏమ॥)
యెదుటనే వున్నాఁడు యిదె నారమణుఁడు
కదిమీఁ దమకము కనురెప్ప లిడిన
పెదవుల నున్నది పే రాతనిదే
కొద దీరవు నా కోరికలు
(॥ఏమ॥)
నగుతా నున్నాఁడు నాతో నాతఁడు
నిగిడిఁ గాఁకలు నే నూరకుండిన
వెగటునఁ బతిపై వేసితి నేఁ జేయి
తగులకతొల్లే తడిపీఁ జెమట
(॥ఏమ॥)
కాఁగిట నుందానఁ గడు నాతనితో
రేఁగీ వలపులు రేవగలు
వీఁగ కలమె శ్రీవేంకటపతి నను
చేఁగదేరె నాచిగురుటధరము
(||pallavi||)
emani sĕppene yiṭṭi nāvalabu
āmīm̐daḍi panuladam̐ḍe yĕṟum̐gu
(||ema||)
yĕduḍane vunnām̐ḍu yidĕ nāramaṇum̐ḍu
kadimīm̐ damagamu kanurĕppa liḍina
pĕdavula nunnadi pe rādanide
kŏda dīravu nā korigalu
(||ema||)
nagudā nunnām̐ḍu nādo nādam̐ḍu
nigiḍim̐ gām̐kalu ne nūraguṁḍina
vĕgaḍunam̐ badibai vesidi nem̐ jeyi
tagulagadŏlle taḍibīm̐ jĕmaḍa
(||ema||)
kām̐giḍa nuṁdānam̐ gaḍu nādanido
rem̐gī valabulu revagalu
vīm̐ga kalamĕ śhrīveṁkaḍabadi nanu
sem̐gaderĕ nāsiguruḍadharamu