Emani seppemayyaa yivigo maabhaagyaalu

ఏమని చెప్పేమయ్యా యివిగో మాభాగ్యాలు
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పేమయ్యా యివిగో మాభాగ్యాలు
నీ మన్ననలే మాకు నిండునిధానాలు

(॥॥)
పలుకుఁ బంతముతోను పతిచిత్తము వచ్చితే
వలపు కామధేనువు వనితలకు
పిలిచి మాఁటాడినప్రియము తంగేటిజున్ను
సెలవులనవ్వులు చేనిపంటలు

(॥॥)
దయతోఁ దనమగఁడు తనవద్దనుండి తేను
వయసు కల్పవృక్షము వనితలకు
నయమునఁ జూచేచూపు నమ్మినటువంటిసొమ్ము
రయమునఁ జెనకులే రత్నాభిషేకములు

(॥॥)
చనవిచ్చి శ్రీ వేంకటేశ నీవు గూడితేను
మనసే పరుసవేది మగువలకు
ననువు నటించి నేఁడు నన్ను నిట్టె యేలితిని
నినుపులరతులివి నిచ్చకల్యాణములు

(||pallavi||)
emani sĕppemayyā yivigo mābhāgyālu
nī mannanale māgu niṁḍunidhānālu

(||||)
palugum̐ baṁtamudonu padisittamu vachchide
valabu kāmadhenuvu vanidalagu
pilisi mām̐ṭāḍinapriyamu taṁgeḍijunnu
sĕlavulanavvulu senibaṁṭalu

(||||)
dayadom̐ danamagam̐ḍu tanavaddanuṁḍi tenu
vayasu kalbavṛkṣhamu vanidalagu
nayamunam̐ jūsesūbu namminaḍuvaṁṭisŏmmu
rayamunam̐ jĕnagule ratnābhiṣhegamulu

(||||)
sanavichchi śhrī veṁkaḍeśha nīvu gūḍidenu
manase parusavedi maguvalagu
nanuvu naḍiṁchi nem̐ḍu nannu niṭṭĕ yelidini
ninubularadulivi nichchagalyāṇamulu