Emani seppemayyaa idivo maa kaampuraalu

ఏమని చెప్పేమయ్యా ఇదివో మా కాఁపురాలు
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పేమయ్యా ఇదివో మా కాఁపురాలు
నీ మేలులోనివారము నీచిత్త మిఁకను

(॥ఏమ॥)
తలఁచితే తలఁపులు తగులములై యుండు
పలికితే మాటలు పచ్చిదేరును
మొలచితే సిగ్గులు ముదిరి తీగెలువారు
వలచితే వలపులు వాములకొలఁదులు

(॥ఏమ॥)
పెంచితే ప్రియములు పెంటలై పెరుగును
వంచుకొంటే నవ్వులు వరదవారు
నించితేఁ దమకములు నిండుబండారములౌను
ముంచితే జవ్వనాలు మోపులకొలఁదులు

(॥ఏమ॥)
తనిసితేఁ గోరికలు తప్పక దైలువారు
మునిపితేఁ బంతములు ముప్పిరిగొను
యెనసితి విటు నన్ను వింతలో శ్రీవేంకటేశ
గొనకొన్నరతు లివి కోట్లకొలఁదులు

(||pallavi||)
emani sĕppemayyā idivo mā kām̐purālu
nī melulonivāramu nīsitta mim̐kanu

(||ema||)
talam̐side talam̐pulu tagulamulai yuṁḍu
paligide māḍalu pachchiderunu
mŏlaside siggulu mudiri tīgĕluvāru
valaside valabulu vāmulagŏlam̐dulu

(||ema||)
pĕṁchide priyamulu pĕṁṭalai pĕrugunu
vaṁchugŏṁṭe navvulu varadavāru
niṁchidem̐ damagamulu niṁḍubaṁḍāramulaunu
muṁchide javvanālu mobulagŏlam̐dulu

(||ema||)
tanisidem̐ gorigalu tappaga dailuvāru
munibidem̐ baṁtamulu muppirigŏnu
yĕnasidi viḍu nannu viṁtalo śhrīveṁkaḍeśha
gŏnagŏnnaradu livi koṭlagŏlam̐dulu