ఏమని చెప్పఁగవచ్చు యీ మగువ నేరుపులు
(॥పల్లవి॥)
ఏమని చెప్పఁగవచ్చు యీ మగువ నేరుపులు
వేమరు దరితీపుల విందులు వెట్టీని
(॥ఏమ॥)
చెలి నీపై వలపుసేసలు చల్లీ నదె
చెలరేఁగి చెలరేఁగి చే సన్నల
యెలమితోఁ బెండ్లి వాయిద్యాల వాయించీ నదె
మొలనూలున గట్టిన మురిపెపుగంటల
(॥ఏమ॥)
తొయ్యలి యడియాసల దోమటి దొడికీనదె
వొయ్యనొయ్యనే మోవి వొడఁబాటుల
నెయ్యపుఁ జుట్టరికాలు నీకే నేరిపీ నదె
కొయ్యకలిచూపుల కసరులను
(॥ఏమ॥)
కమ్మనికాఁగిట బూజగుండలు మోచీనదె
సమ్మతించి సమ్మతించి చనుగుబ్బల
ఇమ్ముల శ్రీవేంకటేశ యీకెను నీవు గూడఁగా
దొమ్మిరతి చెమటలతోడ నీళ్ళాడీని
(||pallavi||)
emani sĕppam̐gavachchu yī maguva nerubulu
vemaru daridībula viṁdulu vĕṭṭīni
(||ema||)
sĕli nībai valabusesalu sallī nadĕ
sĕlarem̐gi sĕlarem̐gi se sannala
yĕlamidom̐ bĕṁḍli vāyidyāla vāyiṁchī nadĕ
mŏlanūluna gaṭṭina muribĕbugaṁṭala
(||ema||)
tŏyyali yaḍiyāsala domaḍi dŏḍigīnadĕ
vŏyyanŏyyane movi vŏḍam̐bāḍula
nĕyyabum̐ juṭṭarigālu nīge neribī nadĕ
kŏyyagalisūbula kasarulanu
(||ema||)
kammanigām̐giḍa būjaguṁḍalu mosīnadĕ
sammadiṁchi sammadiṁchi sanugubbala
immula śhrīveṁkaḍeśha yīgĕnu nīvu gūḍam̐gā
dŏmmiradi sĕmaḍaladoḍa nīḽḽāḍīni