ఏమని చెప్పఁగవచ్చు నిట్టె నీసతి భావము
(॥పల్లవి॥)
ఏమని చెప్పఁగవచ్చు నిట్టె నీసతి భావము
కామించిన చందమో కడఁగు సింగారమో
(॥ఏమ॥)
చెలియ నీమోము చూచి చెక్కులఁ జెమట చిందె
వలపులో అదియ జవ్వనమదమో
నిలువున నంతలోనె నిట్టూర్పు నిగిడించె
కలసేటివేడుకలో కందువతమకమో
(॥ఏమ॥)
కాంత నీవద్దనుండి కళలతోదైవారె
చింతావిరహమో చిందెడుప్రేమో
మంతనపుమాటలాడి మఱి చిరునవ్వు నవ్వె
చెంత నీ పై ఆసలో సిగ్గులమొలకలో
(॥ఏమ॥)
అలమేలుమంగ నిన్ను నపుడే కాఁగిట నించె
తలకొన్నకోరికో తగులాయమో
యెలమి శ్రీవేంకటేశ యిన్నిటా నిన్ను నెనసె
తలఁపులముచ్చటో తనమనోరథమో
(||pallavi||)
emani sĕppam̐gavachchu niṭṭĕ nīsadi bhāvamu
kāmiṁchina saṁdamo kaḍam̐gu siṁgāramo
(||ema||)
sĕliya nīmomu sūsi sĕkkulam̐ jĕmaḍa siṁdĕ
valabulo adiya javvanamadamo
niluvuna naṁtalonĕ niṭṭūrbu nigiḍiṁchĕ
kalaseḍiveḍugalo kaṁduvadamagamo
(||ema||)
kāṁta nīvaddanuṁḍi kaḽaladodaivārĕ
siṁtāvirahamo siṁdĕḍupremo
maṁtanabumāḍalāḍi maṟi sirunavvu navvĕ
sĕṁta nī pai āsalo siggulamŏlagalo
(||ema||)
alamelumaṁga ninnu nabuḍe kām̐giḍa niṁchĕ
talagŏnnagorigo tagulāyamo
yĕlami śhrīveṁkaḍeśha yinniḍā ninnu nĕnasĕ
talam̐pulamuchchaḍo tanamanorathamo