ఏమని చెప్పఁగవచ్చు నింతి భావము
(॥పల్లవి॥)
ఏమని చెప్పఁగవచ్చు నింతి భావము
కామించి నీకుఁగానే కరఁగీని మనసు
(॥ఏమ॥)
బత్తితో జవరాలు పాదాలు విసుకఁగాను
చిత్తడిచెమట గారీఁ జేతులవెంట
వొత్తివొత్తి నీకుఁ గడుపూడిగాలు సేయఁగాను
హత్తినిట్టూర్పులచేత నాఱడాయఁ జెలియ
(॥ఏమ॥)
మవ్వపుఁగూరిమి నీతో మాటలాడిమాటలాడి
నివ్వెరగుతోడుత నిలుచున్నది
చివ్వన మోముచూచి చిరునవ్వు నవ్వఁగాను
వువ్విళ్లూరేఆసలతో నుమ్మగిలీఁజెలియ
(॥ఏమ॥)
గుఱుతుగాఁ గాఁగిట గుబ్బలు నిన్నొత్తఁగాను
నెఱిఁగళ లుప్పతిల్లీ నెమ్మోమున
మఱి నిన్నుఁ గూడఁగ నెమ్మది శ్రీవేంకటేశుఁడ
మెఱసీ నీతో నలుమేలుమంగ చెలియ
(||pallavi||)
emani sĕppam̐gavachchu niṁti bhāvamu
kāmiṁchi nīgum̐gāne karam̐gīni manasu
(||ema||)
battido javarālu pādālu visugam̐gānu
sittaḍisĕmaḍa gārīm̐ jedulavĕṁṭa
vŏttivŏtti nīgum̐ gaḍubūḍigālu seyam̐gānu
hattiniṭṭūrbulaseda nāṟaḍāyam̐ jĕliya
(||ema||)
mavvabum̐gūrimi nīdo māḍalāḍimāḍalāḍi
nivvĕragudoḍuda nilusunnadi
sivvana momusūsi sirunavvu navvam̐gānu
vuvviḽlūreāsalado nummagilīm̐jĕliya
(||ema||)
guṟudugām̐ gām̐giḍa gubbalu ninnŏttam̐gānu
nĕṟim̐gaḽa luppadillī nĕmmomuna
maṟi ninnum̐ gūḍam̐ga nĕmmadi śhrīveṁkaḍeśhum̐ḍa
mĕṟasī nīdo nalumelumaṁga sĕliya