ఏమని చెప్పఁగవచ్చు నిటువంటి నీ మోహము
(॥పల్లవి॥)
ఏమని చెప్పఁగవచ్చు నిటువంటి నీ మోహము
భామ దలఁచి తలఁచి పైపైనె మెచ్చీని
(॥ఏమ॥)
చెలియఁ జూచినచూపు చిత్తమురోఁ బెనగొని
నిలువునఁ దతిగొనె నివ్వెరగులు
పిలిచినపిలుపులు పెదవిపై నాఁటుకొని
తలకొనీ వలపులతరితీపులు
(॥ఏమ॥)
కాంతతో నవ్విననవ్వు కడు నిన్నుఁ బెనగొనె
దొంతిపులకలై రేఁగి తోడఁదోడను
మంతనపురసాలు మర్మములెల్లా సోఁకి
సంతోసాలు వుట్టించీ సరుగఁ గోరికలు
(॥ఏమ॥)
భామకుఁ జేసినసన్న పలుమారుఁ దలఁబాలై
ఆముకొని రాలఁజొచ్చె నంగములను
చేముంచి కూడితి విట్టె శ్రీ వేంకటేశ్వర
వాములై నిలిచె నవె వదలనిరతులు
(||pallavi||)
emani sĕppam̐gavachchu niḍuvaṁṭi nī mohamu
bhāma dalam̐si talam̐si paibainĕ mĕchchīni
(||ema||)
sĕliyam̐ jūsinasūbu sittamurom̐ bĕnagŏni
niluvunam̐ dadigŏnĕ nivvĕragulu
pilisinabilubulu pĕdavibai nām̐ṭugŏni
talagŏnī valabuladaridībulu
(||ema||)
kāṁtado navvinanavvu kaḍu ninnum̐ bĕnagŏnĕ
dŏṁtibulagalai rem̐gi toḍam̐doḍanu
maṁtanaburasālu marmamulĕllā som̐ki
saṁtosālu vuṭṭiṁchī sarugam̐ gorigalu
(||ema||)
bhāmagum̐ jesinasanna palumārum̐ dalam̐bālai
āmugŏni rālam̐jŏchchĕ naṁgamulanu
semuṁchi kūḍidi viṭṭĕ śhrī veṁkaḍeśhvara
vāmulai nilisĕ navĕ vadalaniradulu