ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ సుద్దులు
(॥పల్లవి॥)
ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ సుద్దులు
ఆముకొన్న నీ నటన లారడాయఁ గదవే
(॥ఏమ॥)
మొక్కు మొక్కరాఁగాను మునిగొప్పు జారెఁగదె
నిక్కి చూచితే సిగ్గులు నిండెఁగదవే
కక్కసించి నవ్వఁగాను కడుఁ జెమరించెఁగదె
ఇక్కడఁ బతి సంగాతా లింత సేసెఁగదవె
(॥ఏమ॥)
చెలుములు సేయఁగాను సేసలు పైఁబడెఁగదె
సొలయఁబోతే మతి చొక్కెఁగదవె
వెలిఁ గానుకియ్యఁగా చన్నులు గానవచ్చెఁగదె
యెలమి నీ చేఁతలే నిన్నింత సేసెఁగదవే
(॥ఏమ॥)
కదిసి కాఁగిలించఁగా కళలు రేఁగెఁగదె
అదన మో వియ్యఁగాఁ గంటేయఁగదవె
వదలక శ్రీవేంకటేశ్వరుఁడు తానె కూడె
యెదుటనే నీ భాగ్యా లింతసేసెఁగదవే
(||pallavi||)
emani sĕppam̐gavachchu nidivo nī suddulu
āmugŏnna nī naḍana lāraḍāyam̐ gadave
(||ema||)
mŏkku mŏkkarām̐gānu munigŏppu jārĕm̐gadĕ
nikki sūside siggulu niṁḍĕm̐gadave
kakkasiṁchi navvam̐gānu kaḍum̐ jĕmariṁchĕm̐gadĕ
ikkaḍam̐ badi saṁgādā liṁta sesĕm̐gadavĕ
(||ema||)
sĕlumulu seyam̐gānu sesalu paim̐baḍĕm̐gadĕ
sŏlayam̐bode madi sŏkkĕm̐gadavĕ
vĕlim̐ gānugiyyam̐gā sannulu gānavachchĕm̐gadĕ
yĕlami nī sem̐tale ninniṁta sesĕm̐gadave
(||ema||)
kadisi kām̐giliṁcham̐gā kaḽalu rem̐gĕm̐gadĕ
adana mo viyyam̐gām̐ gaṁṭeyam̐gadavĕ
vadalaga śhrīveṁkaḍeśhvarum̐ḍu tānĕ kūḍĕ
yĕduḍane nī bhāgyā liṁtasesĕm̐gadave