Emani seppamgavachchu nidivo mee nerubulu

ఏమని చెప్పఁగవచ్చు నిదివో మీ నేరుపులు
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పఁగవచ్చు నిదివో మీ నేరుపులు
ఆముకొని చూచి చూచి అరుదయ్యీ నాకు

(॥ఏమ॥)
వలచివచ్చినరాక వాడికలు వుట్టించు
పిలిచి యిచ్చేవిడెము ప్రియమందించు
నిలిచి చూచిన చూపు నెమ్మనము నాటించు
బలిమి మొక్కిన మొక్కు పంత మీడేరించును

(॥ఏమ॥)
వినుకలి యెడమాట వేడుకలు గలిగించు
ననుపైన సరసము నవ్వింపించు
తనువు సోఁకిన పొందు తమకము గడురేఁడు
చెనకి చేసిన చేతఁ సిగ్గులు మీరించును

(॥ఏమ॥)
చేయారాఁ జేసిన సన్న చిత్తములు గరఁగించు
పాయరాని కూటములు బాస సేయించు
యీయెడ శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
మీయిద్దరి కూటములు మెచ్చి పొగడించును

(||pallavi||)
emani sĕppam̐gavachchu nidivo mī nerubulu
āmugŏni sūsi sūsi arudayyī nāgu

(||ema||)
valasivachchinarāga vāḍigalu vuṭṭiṁchu
pilisi yichcheviḍĕmu priyamaṁdiṁchu
nilisi sūsina sūbu nĕmmanamu nāḍiṁchu
balimi mŏkkina mŏkku paṁta mīḍeriṁchunu

(||ema||)
vinugali yĕḍamāḍa veḍugalu galigiṁchu
nanubaina sarasamu navviṁpiṁchu
tanuvu som̐kina pŏṁdu tamagamu gaḍurem̐ḍu
sĕnagi sesina sedam̐ siggulu mīriṁchunu

(||ema||)
seyārām̐ jesina sanna sittamulu garam̐giṁchu
pāyarāni kūḍamulu bāsa seyiṁchu
yīyĕḍa śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
mīyiddari kūḍamulu mĕchchi pŏgaḍiṁchunu