Emani seppamgavachchu needani pradaabamu

ఏమని చెప్పఁగవచ్చు నీతని ప్రతాపము
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పఁగవచ్చు నీతని ప్రతాపము
భూమిలో నారదాదులు పొగడే రీతనిని

(॥ఏమ॥)
పిడుగులు రాలఁజొచ్చె పెనుఁగంభము వగిలే
వెడలె నందులోల వీరసింహము
కడుపుచించి పేగులు గక్కన జంద్యాలువేసె
పడె హిరణ్యదైత్యుఁడు పగదీరె నదివో

(॥ఏమ॥)
ఘోర చక్రము గెరలె కోలువెల్ల బెదరెను
ఆరభటి గావించె నాదిసింహము
ధీరుఁడై నెత్తురు నలుదిక్కులకు వెదచల్లె
పారిరి రాకాసులెల్ల పగదీరె నదివో

(॥ఏమ॥)
సురలు జయవెట్టరి శుభములు భువి నిండె
తిరమాయ శ్రీవేంకటదేవ సింహము
గరిమఁ బ్రహ్లాదునిఁ గాచె దాసుల రక్షించె
పరసేనలు సమసె పగదీరెనిదివో

(||pallavi||)
emani sĕppam̐gavachchu nīdani pradābamu
bhūmilo nāradādulu pŏgaḍe rīdanini

(||ema||)
piḍugulu rālam̐jŏchchĕ pĕnum̐gaṁbhamu vagile
vĕḍalĕ naṁdulola vīrasiṁhamu
kaḍubusiṁchi pegulu gakkana jaṁdyāluvesĕ
paḍĕ hiraṇyadaityum̐ḍu pagadīrĕ nadivo

(||ema||)
ghora sakramu gĕralĕ koluvĕlla bĕdarĕnu
ārabhaḍi gāviṁchĕ nādisiṁhamu
dhīrum̐ḍai nĕtturu naludikkulagu vĕdasallĕ
pāriri rāgāsulĕlla pagadīrĕ nadivo

(||ema||)
suralu jayavĕṭṭari śhubhamulu bhuvi niṁḍĕ
tiramāya śhrīveṁkaḍadeva siṁhamu
garimam̐ brahlādunim̐ gāsĕ dāsula rakṣhiṁchĕ
parasenalu samasĕ pagadīrĕnidivo