Emani polisere yimti simgaaramu livi

ఏమని పోలిచేరే యింతి సింగారము లివి
Language

(॥పల్లవి॥)
ఏమని పోలిచేరే యింతి సింగారము లివి
కామినులాల మీరు కాంతుని యెదుటను

(॥ఏమ॥)
చెక్కునఁ బెట్టినచేయి సిగ్గున కింతేకాక
తక్కక యెంచితే దొంతితామరౌటకా
వుక్కున జారుఁదురుము వొయ్యారాన కింతేకాక
పక్కనఁ జీఁకటియేరై పారేయందుకా

(॥ఏమ॥)
గబ్బలఁ గప్పినపయ్యద గుట్టుకొర కింతేకాక
గబ్బిజవ్వనము మూటగట్టేయందుకా
వుబ్బుజెమటలు మనసొగిఁ గరఁగుటగాక
అబ్బురపుముత్తెములహరము లౌటకా

(॥ఏమి॥)
ముట్టినకాఁగిలి పతిమోహపుఁబదిలి గాక
అట్టెవలపులతీఁగె లల్లేకొరకా
గట్టిగ నీకెను శ్రీవేంకటేశుఁడు తానె కూడె
నెట్టనరతుల తమి నించేటికొరకా

(||pallavi||)
emani polisere yiṁti siṁgāramu livi
kāminulāla mīru kāṁtuni yĕduḍanu

(||ema||)
sĕkkunam̐ bĕṭṭinaseyi sigguna kiṁtegāga
takkaga yĕṁchide dŏṁtidāmarauḍagā
vukkuna jārum̐durumu vŏyyārāna kiṁtegāga
pakkanam̐ jīm̐kaḍiyerai pāreyaṁdugā

(||ema||)
gabbalam̐ gappinabayyada guṭṭugŏra kiṁtegāga
gabbijavvanamu mūḍagaṭṭeyaṁdugā
vubbujĕmaḍalu manasŏgim̐ garam̐guḍagāga
abburabumuttĕmulaharamu lauḍagā

(||emi||)
muṭṭinagām̐gili padimohabum̐badili gāga
aṭṭĕvalabuladīm̐gĕ lallegŏragā
gaṭṭiga nīgĕnu śhrīveṁkaḍeśhum̐ḍu tānĕ kūḍĕ
nĕṭṭanaradula tami niṁcheḍigŏragā