ఏమని పొగడుదుమే యిఁక నిన్నును
(॥పల్లవి॥)
ఏమని పొగడుదుమే యిఁక నిన్నును
ఆమని సొబగుల అలమేల్మంగ
(॥॥)
తెలిఁ గన్నుల నీతేటలేకదవే
వెలయఁగ విభునికి వెన్నెలలు
పులకల మొలకలపొదు లివిగదవే
పలుమరుఁ బువ్వుల పానుపులు
(॥॥)
తియ్యనినీమోవితేనెలే కదవే
వియ్యపురమణుని విందు లివి
ముయ్యక మూసిన మొలకనవ్వుగదె
నెయ్యపుఁగప్రపునెరిబాగాలు
(॥॥)
కైవసమగు నీకాఁగిలే కదవే
శ్రీ వేంకటేశ్వరుసిరినగరు
తావుకొన్న మీతమకములేకదే
కావించిన మీకల్యాణములు
(||pallavi||)
emani pŏgaḍudume yim̐ka ninnunu
āmani sŏbagula alamelmaṁga
(||||)
tĕlim̐ gannula nīdeḍalegadave
vĕlayam̐ga vibhunigi vĕnnĕlalu
pulagala mŏlagalabŏdu livigadave
palumarum̐ buvvula pānubulu
(||||)
tiyyaninīmovidenĕle kadave
viyyaburamaṇuni viṁdu livi
muyyaga mūsina mŏlaganavvugadĕ
nĕyyabum̐gaprabunĕribāgālu
(||||)
kaivasamagu nīgām̐gile kadave
śhrī veṁkaḍeśhvarusirinagaru
tāvugŏnna mīdamagamulegade
kāviṁchina mīgalyāṇamulu