ఏమని పొగడుదు నీ విట్టివాఁడవు
(॥పల్లవి॥)
ఏమని పొగడుదు నీ విట్టివాఁడవు
కామినుల పాలిటికి కల్పవృక్షమైతివి
(॥ఏమ॥)
మగువలు యేమాడినా మనసే కలఁగునా
తగునీగుణము సముద్రమువంటిది
సొగిసి యెంత సోదించి చూచినాఁ గానవచ్చునా
మిగులా నీమన సిట్టె మిన్నునేలవంటిది
(॥ఏమ॥)
కిమ్ముల నెవ్వతె నిన్ను కినిసినాఁ జెదరునా
నమ్మననీదయ విధానమువంటిది
నెమ్మి యెంతగలిగినా నెట్టనఁ జంచలించునా
పమ్మిననీమన్నన పైఁడికుండవంటిది
(॥ఏమ॥)
చిక్కించు కెవ్వరు నిన్ను చెందినా మొగచాటౌనా
తక్కక నీరతి యమృతము వంటిది
ఇక్కడ శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
మిక్కిలి నన్నేలితివి మేలుగలవాఁడవు
(||pallavi||)
emani pŏgaḍudu nī viṭṭivām̐ḍavu
kāminula pāliḍigi kalbavṛkṣhamaidivi
(||ema||)
maguvalu yemāḍinā manase kalam̐gunā
tagunīguṇamu samudramuvaṁṭidi
sŏgisi yĕṁta sodiṁchi sūsinām̐ gānavachchunā
migulā nīmana siṭṭĕ minnunelavaṁṭidi
(||ema||)
kimmula nĕvvadĕ ninnu kinisinām̐ jĕdarunā
nammananīdaya vidhānamuvaṁṭidi
nĕmmi yĕṁtagaliginā nĕṭṭanam̐ jaṁchaliṁchunā
pamminanīmannana paim̐ḍiguṁḍavaṁṭidi
(||ema||)
sikkiṁchu kĕvvaru ninnu sĕṁdinā mŏgasāḍaunā
takkaga nīradi yamṛtamu vaṁṭidi
ikkaḍa śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
mikkili nannelidivi melugalavām̐ḍavu