Emani pogadavachchu nitti mee jaanadanaalu

ఏమని పొగడవచ్చు నిట్టి మీ జాణతనాలు
Language

(॥పల్లవి॥)
ఏమని పొగడవచ్చు నిట్టి మీ జాణతనాలు
భూమిలో చెల్లుబడై పొలుపొందుఁగాక

(॥ఏమ॥)
చిత్తములో పాయరాని చెలిమి మొలచితేను
కొత్తలైన కోరికలు కొడిసాగును
బత్తితోడి వినయాలు పాదుకొని వుండితేను
పొత్తుల భోగములకుఁ బోది యెక్కును

(॥ఏమ॥)
కన్నులకు మోము చూచే కాంక్షలు గలిగితేను
తన్నుఁదానే మాఁటలాడఁ దమిరేఁగును
అన్నిటా మంచి గుణాలు యలవడి వుండితేను
యెన్నిన వేడుకలెల్లా నీడేరును

(॥ఏమ॥)
యాడు జోడైన మేనుల నింపులు వొడమితేను
తోడఁదోడ సరసాలు తుదముట్టును
కూడి శ్రీవేంకటేశుతోఁ గూరిసి నిట్టె వుండితే
పాడిపంతములు మీలో ఫలియించును

(||pallavi||)
emani pŏgaḍavachchu niṭṭi mī jāṇadanālu
bhūmilo sĕllubaḍai pŏlubŏṁdum̐gāga

(||ema||)
sittamulo pāyarāni sĕlimi mŏlasidenu
kŏttalaina korigalu kŏḍisāgunu
battidoḍi vinayālu pādugŏni vuṁḍidenu
pŏttula bhogamulagum̐ bodi yĕkkunu

(||ema||)
kannulagu momu sūse kāṁkṣhalu galigidenu
tannum̐dāne mām̐ṭalāḍam̐ damirem̐gunu
anniḍā maṁchi guṇālu yalavaḍi vuṁḍidenu
yĕnnina veḍugalĕllā nīḍerunu

(||ema||)
yāḍu joḍaina menula niṁpulu vŏḍamidenu
toḍam̐doḍa sarasālu tudamuṭṭunu
kūḍi śhrīveṁkaḍeśhudom̐ gūrisi niṭṭĕ vuṁḍide
pāḍibaṁtamulu mīlo phaliyiṁchunu