Emani pogadavachchu niduvamti seluvamu

ఏమని పొగడవచ్చు నిటువంటి చెలువము
Language

(॥పల్లవి॥)
ఏమని పొగడవచ్చు నిటువంటి చెలువము
కామితార్ధముల నిచ్చే కల్ప వృక్ష మితఁడు

(॥ఏమని॥)
పలువేదఘోషములతో బంగారుబిందెల నించి
జలకవర్చే రదె శౌరికి
మెలుపు వనము మీద మేఘము లురుములతో
జలజల వరుషించేచంద మాయ నిదివో

(॥ఏమని॥)
పటికపుగిన్నెలను పచ్చకప్పురము దెచ్చి
ఘటనఁ జాఁతేరు శ్రీకాంతునికీ
తటుకనఁ దనభావఁ దగఁ బెక్కుచంద్రులెల్లా
నటన నమృతకిరణాలు నలి నించినట్లు

(॥ఏమని॥)
అందుపైఁ దట్టుపుణుఁ గలఁది యలమేల్మంగ
నిందరు శ్రీవేంకటేశు యెదఁ గట్టిరి
చందమై బ్రహ్మండము సర్వంపదలతోడ
కందువ మెరసినట్టు కానిపించె నిదివో

(||pallavi||)
emani pŏgaḍavachchu niḍuvaṁṭi sĕluvamu
kāmidārdhamula nichche kalba vṛkṣha midam̐ḍu

(||emani||)
paluvedaghoṣhamulado baṁgārubiṁdĕla niṁchi
jalagavarse radĕ śhaurigi
mĕlubu vanamu mīda meghamu lurumulado
jalajala varuṣhiṁchesaṁda māya nidivo

(||emani||)
paḍigabuginnĕlanu pachchagappuramu dĕchchi
ghaḍanam̐ jām̐teru śhrīgāṁtunigī
taḍuganam̐ danabhāvam̐ dagam̐ bĕkkusaṁdrulĕllā
naḍana namṛtagiraṇālu nali niṁchinaṭlu

(||emani||)
aṁdubaim̐ daṭṭubuṇum̐ galam̐di yalamelmaṁga
niṁdaru śhrīveṁkaḍeśhu yĕdam̐ gaṭṭiri
saṁdamai brahmaṁḍamu sarvaṁpadaladoḍa
kaṁduva mĕrasinaṭṭu kānibiṁchĕ nidivo