ఏమని పొగడవచ్చు నిదివో నీ లీలలు
(॥పల్లవి॥)
ఏమని పొగడవచ్చు నిదివో నీ లీలలు
ఆముకొన్న నీ వలపు లంగడికి నెక్కెను
(॥ఏమ॥)
బంగారుబొమ్మవంటిపడఁతి వద్ద నుండఁగా
చెంగలించి సంతోసానఁ జెలరేఁగేవు
ముంగిటనున్నసతులు ముసిముసినవ్వులతో
తొంగి చూచే రదె నీసుద్దులు చెప్పుకొంటాను
(॥ఏమ॥)
చిలుకలకొలికియై చెలి నీతో మాటాడఁగా
వెలలేని వేడుకతో విఱ్ఱవీఁగేవు
కెలననున్న దేవుళ్లు కెరలి తెరమాటున
నిలిచి యాలకించి వినేరు మెచ్చుకొంటాను
(॥ఏమ॥)
మరుతల్లి యలమేలుమంగ విడెమియ్యఁగాను
సిరుల శ్రీవేంకటేశ చిమ్మిరేఁగేవు
విరుల సేసలువెట్టి వింతసతు లిద్దరికి
దొరుకొని నిన్నుఁ గూడి దోమటి గలపేరు
(||pallavi||)
emani pŏgaḍavachchu nidivo nī līlalu
āmugŏnna nī valabu laṁgaḍigi nĕkkĕnu
(||ema||)
baṁgārubŏmmavaṁṭibaḍam̐ti vadda nuṁḍam̐gā
sĕṁgaliṁchi saṁtosānam̐ jĕlarem̐gevu
muṁgiḍanunnasadulu musimusinavvulado
tŏṁgi sūse radĕ nīsuddulu sĕppugŏṁṭānu
(||ema||)
silugalagŏligiyai sĕli nīdo māḍāḍam̐gā
vĕlaleni veḍugado viṭravīm̐gevu
kĕlananunna devuḽlu kĕrali tĕramāḍuna
nilisi yālagiṁchi vineru mĕchchugŏṁṭānu
(||ema||)
marudalli yalamelumaṁga viḍĕmiyyam̐gānu
sirula śhrīveṁkaḍeśha simmirem̐gevu
virula sesaluvĕṭṭi viṁtasadu liddarigi
dŏrugŏni ninnum̐ gūḍi domaḍi galaberu