ఏమని నీకు మొక్కే నిటువంటిదాన నేను
(॥పల్లవి॥)
ఏమని నీకు మొక్కే నిటువంటిదాన నేను
ఆముకొని యప్పటిని ఆదరించేవు నన్ను
(॥ఏమ॥)
కదిసి నీదేవినైన గర్వాన నే నాడితిని
యెదురు మాటలు నీతో యెన్నియైనాను
మదన పరవశాన మరిఁ గొన్ని సేసితి
చెదరి యెవ్వరితోడాఁ జెప్పరాని చేఁతలు
(॥ఏమ॥)
మన్నించేవనుచు నీతో మందెమేళాల నవ్వితి
సన్నల చాయల నిట్టె సరిబేసికి
చిన్నదానఁ గనక నీసిగ్గులు విడిపించితి
కన్న వారికెల్లా నవి కమ్మని గురుతులు
(॥ఏమ॥)
కొసరి నీవు గూడిన కూటాలకు నే నొక్కితి
పసిమి నీ చెక్కులు నేఁ బలుమారును
యెసఁగితి శ్రీ వేంకటేశ నీకీడు గనక
రసికులకెల్లా నవి రహస్యపు కతలు
(||pallavi||)
emani nīgu mŏkke niḍuvaṁṭidāna nenu
āmugŏni yappaḍini ādariṁchevu nannu
(||ema||)
kadisi nīdevinaina garvāna ne nāḍidini
yĕduru māḍalu nīdo yĕnniyainānu
madana paravaśhāna marim̐ gŏnni sesidi
sĕdari yĕvvaridoḍām̐ jĕpparāni sem̐talu
(||ema||)
manniṁchevanusu nīdo maṁdĕmeḽāla navvidi
sannala sāyala niṭṭĕ saribesigi
sinnadānam̐ ganaga nīsiggulu viḍibiṁchidi
kanna vārigĕllā navi kammani gurudulu
(||ema||)
kŏsari nīvu gūḍina kūḍālagu ne nŏkkidi
pasimi nī sĕkkulu nem̐ balumārunu
yĕsam̐gidi śhrī veṁkaḍeśha nīgīḍu ganaga
rasigulagĕllā navi rahasyabu kadalu