ఏమని నే నాడినాను యీసడించేవు
(॥పల్లవి॥)
ఏమని నే నాడినాను యీసడించేవు
వేమారు మీరలిగితే వేఁడుకొనఁ దగదా
(॥ఏమ॥)
తగవు చెప్పితినా తరుణికి నీకు నేఁడు
అగడుమీవోజ తగదంటిఁగాక
తగులుగలదానను దండనున్నదానను
మగటిమి మీవాదులు మానుపఁగద గదా
(॥ఏమ॥)
గుట్టు వెళ్లవేసితినా కోమలికి నీకు నేను
పెట్టిన వొట్లు తలఁపించితిఁగాక
పెట్టిన సేసదానను ప్రియముతోడి దానను
మట్టులు మీరితే మిమ్ము మచ్చరించఁదగదా
(॥ఏమ॥)
చెనకులు రేఁచితినా చేతులు మిమ్ముఁబట్టి
పెనఁగించి మీవలపు పెంచితిఁగాక
ఘనుఁడ శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
చనవుగలదానవు సాదించఁ దగదా
(||pallavi||)
emani ne nāḍinānu yīsaḍiṁchevu
vemāru mīraligide vem̐ḍugŏnam̐ dagadā
(||ema||)
tagavu sĕppidinā taruṇigi nīgu nem̐ḍu
agaḍumīvoja tagadaṁṭim̐gāga
tagulugaladānanu daṁḍanunnadānanu
magaḍimi mīvādulu mānubam̐gada gadā
(||ema||)
guṭṭu vĕḽlavesidinā komaligi nīgu nenu
pĕṭṭina vŏṭlu talam̐piṁchidim̐gāga
pĕṭṭina sesadānanu priyamudoḍi dānanu
maṭṭulu mīride mimmu machchariṁcham̐dagadā
(||ema||)
sĕnagulu rem̐sidinā sedulu mimmum̐baṭṭi
pĕnam̐giṁchi mīvalabu pĕṁchidim̐gāga
ghanum̐ḍa śhrī veṁkaḍeśha kalasidi viḍu nannu
sanavugaladānavu sādiṁcham̐ dagadā