ఏమని మెత్తు నిన్ను యింత మేలు చేసితిని
(॥పల్లవి॥)
ఏమని మెత్తు నిన్ను యింత మేలు చేసితిని
కామిని నా మాన మిట్టె కాచితివి నీవు
(॥ఏమని॥)
యెదురు చూడగాఁనె యింతలో విచ్చేసి నీవు
అదన నా చేయి వట్టి ఆదరించితి
వదలుఁ బయ్యదతోడ వసివాడే నన్నుఁ జూచి
పొదిగి పయ్యద గప్పి పొది సేనితివి
(॥ఏమని॥)
మొక్కుకోఁగానె నీకు ముంచి నాకు వర మిచ్చి
చెక్కు నొక్కి బుజ్జగించి సేద దేర్చితి
లక్కవంటి మదితోడ లాచక వుండిన నాతో
మక్కువలు చల్లి చల్లి మంతన మాడితివి
(॥ఏమిని॥)
చేయి చాఁచగానె నన్ను శ్రీవెంకటేశుఁడ కూడి
చాయల నవ్వులు నవ్వి సన్న సేసితి
పాయపువేడుకతోడ పదరుచు నుండేనన్ను
ఆయము లంటుచు మరి అట్టె మన్నించితిని
(||pallavi||)
emani mĕttu ninnu yiṁta melu sesidini
kāmini nā māna miṭṭĕ kāsidivi nīvu
(||emani||)
yĕduru sūḍagām̐nĕ yiṁtalo vichchesi nīvu
adana nā seyi vaṭṭi ādariṁchidi
vadalum̐ bayyadadoḍa vasivāḍe nannum̐ jūsi
pŏdigi payyada gappi pŏdi senidivi
(||emani||)
mŏkkugom̐gānĕ nīgu muṁchi nāgu vara michchi
sĕkku nŏkki bujjagiṁchi seda dersidi
lakkavaṁṭi madidoḍa lāsaga vuṁḍina nādo
makkuvalu salli salli maṁtana māḍidivi
(||emini||)
seyi sām̐sagānĕ nannu śhrīvĕṁkaḍeśhum̐ḍa kūḍi
sāyala navvulu navvi sanna sesidi
pāyabuveḍugadoḍa padarusu nuṁḍenannu
āyamu laṁṭusu mari aṭṭĕ manniṁchidini