Emani konaadavachchu nidani sakkamdanamu

ఏమని కొనాడవచ్చు నితని చక్కఁదనము
Language

(॥పల్లవి॥)
ఏమని కొనాడవచ్చు నితని చక్కఁదనము
మోము చూచినంతలోనే మోహింపించీ నితఁడు

(॥ఏమని॥)
మదనజనకుఁ కిట్టే మజ్జనమాడేటివేళ
కదిసి హస్తలుఁ దానుఁ గారుకమ్ముచు
చదలఁ గడళ్ళతోడిసముద్రమె రూపై
యెదుట నిలుచున్నట్టు యిదె వున్నాఁ డీఁతడు

(॥ఏమని॥)
హరి కప్పురపుధూళి యలఁదుకొనినవేళ
సిరులు మించఁగను చూచినవారికి
అరిది శరత్కాలమందలితెల్ల నిమేఘ
మిరవై రూపై వున్న ట్టెన్నికాయ నీతఁడు

(॥ఏమని॥)
కావింపఁ బుళుగు వూసి కడునల్లనై సొమ్ముల
యీవల నలమేల్మంగ నెదఁ గట్టుక
కావిరి నింద్రనీలపుగనిరూపై వుండినట్టు
శ్రీవేంకటేశ్వరుఁడు చెలవొందె నీతఁడు

(||pallavi||)
emani kŏnāḍavachchu nidani sakkam̐danamu
momu sūsinaṁtalone mohiṁpiṁchī nidam̐ḍu

(||emani||)
madanajanagum̐ kiṭṭe majjanamāḍeḍiveḽa
kadisi hastalum̐ dānum̐ gārugammusu
sadalam̐ gaḍaḽḽadoḍisamudramĕ rūbai
yĕduḍa nilusunnaṭṭu yidĕ vunnām̐ ḍīm̐taḍu

(||emani||)
hari kappurabudhūḽi yalam̐dugŏninaveḽa
sirulu miṁcham̐ganu sūsinavārigi
aridi śharatkālamaṁdalidĕlla nimegha
miravai rūbai vunna ṭṭĕnnigāya nīdam̐ḍu

(||emani||)
kāviṁpam̐ buḽugu vūsi kaḍunallanai sŏmmula
yīvala nalamelmaṁga nĕdam̐ gaṭṭuga
kāviri niṁdranīlabuganirūbai vuṁḍinaṭṭu
śhrīveṁkaḍeśhvarum̐ḍu sĕlavŏṁdĕ nīdam̐ḍu